
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ వేల సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,121 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 5,487 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,161 కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 7,210 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,12,300. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,116. కోవిడ్‌బారిన పడ్డవారిలో తాజాగా 37 మంది ప్రాణాలు విడువడంతో ఆ మొత్తం సంఖ్య 5745 కి చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా చేసిన పరీక్షల్లో 34,531 ట్రూనాట్ పద్ధతిలో, 31,590 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశామని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 56,66,323 నమూనాలు పరీక్షించామని వెల్లడించింది.
(చదవండి: 25 శాతం పాజిటివ్ కేసులు తగ్గుదల)