25 శాతం పాజిటివ్‌ కేసులు తగ్గుదల

Jawahar Reddy Said Corona Cases Are Declining In AP - Sakshi

అధిక ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్‌లు రద్దు..

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య, మరణాలు తగ్గుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో రికార్డ్‌ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని.. 25 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గాయని ఆయన వెల్లడించారు. కొన్ని కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని, ఇప్పటి వరకు 26 ఆసుపత్రుల కోవిడ్‌ లైసెన్సులు రద్దు చేశామని ఆయన వెల్లడించారు. (చదవండి: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్’ ఉద్యోగులకు శుభవార్త..‌)

‘‘తూర్పుగోదావరి లో 17 ఆస్పత్రుల లైసెన్స్ లు రద్దు చేశాం. ఎవ్వరు అధికంగా డబ్బులు వసూలు చేసిన కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కి కూడా ఇదే చెప్పా. రెండో వేవ్ కూడా ఉంటుంది. కేసులు నమోదవుతాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. అక్కడ గ్రామాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది.  దాని వలన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని’’ జవహర్‌రెడ్డి వివరించారు. (చదవండి: 95 వేలు దాటిన కోవిడ్ మరణాలు)

కంటైన్మెంట్ కానీ ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ సర్వే చేస్తున్నామని, రెండోసారి కూడా కరోనా పాజిటివ్‌ వస్తున్న కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల జరుగుతుందని, మన రాష్ట్రానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా కిట్లు ఇస్తున్నామని, 2 లక్షల కిట్లు కొనుగోలు చేశామని జవహర్‌రెడ్డి వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top