ఒంగోలులో యువతుల సహజీవనం.. ఆ వీడియోలు చూసి..

Controversy of Two Young Girls living Relation in One House at Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతుల సహజీవనం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ యువతి తల్లి స్పందిస్తూ ఇద్దరు అమ్మాయిలు(సుమలత, రమ్య) వివాహం చేసుకున్నారంటూ ఒంగోలు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ఈ ఘటనపై యువతులను వివరణ కోరగా.. తమ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదంటున్నారు. మేము ఇద్దరం అక్కా చెల్లెల్లా కలిసి మెలసి జీవిస్తున్నామన్నారు. 

రమ్యకు మేనమామతో ఆమె తల్లి నాగమణి వివాహం చేసేందుకు సిద్దమవ్వడంతో ఆ పెళ్లి ఇష్టం లేక రమ్య తన వద్ద ఉంటోందని సుమలత పేర్కొంది. కేవలం టిక్ టాక్‌లో రమ్య తాను కలిసి వివాహం చేసుకుంటున్నట్లు నటించిన వీడియోలు చూసి అదే నిజమైన పెళ్లిగా భావిస్తూ తమ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అపోహపడుతోందని తెలిపింది.

ఇదిలా ఉండగా సుమలత నివాసంలో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమేనని చెబుతోంది. ఇద్దరు మహిళల వివాహంపై తాను మందలించడంతో తనను ఇంటి పనుల్లో నుంచి తొలగిస్తామని చెప్పారని తెలిపింది. దీంతో అసలు నిజం ఏంటనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

చదవండి: (ప్రేమ వివాహం:  ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top