‘జిల్లాలో ఇప్పటివరకు 6,46,809 మందికి వ్యాక్సిన్‌ వేశాం’ | Collector Imtiaz: Till Now 646809 People Get Vaccinated Krishna District | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలను కూడా కోవిడ్‌ సెంటర్లుగా మారుస్తున్నాం: కలెక్టర్‌

May 8 2021 3:17 PM | Updated on May 8 2021 4:29 PM

Collector Imtiaz: Till Now 646809 People Get Vaccinated Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాకు 6 లక్షల 50వేల వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయని, ఇప్పటివరకు 6,46,809 మందికి వ్యాక్సిన్‌ వేశామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. వీరిలో 4లక్షల 85వేల మందికి మొదటి డోస్‌ పూర్తైందని, 1,61,809 మందికి సెకండ్‌ డోస్‌ వేసినట్లు పేర్కొన్నారు. వచ్చిన వ్యాక్సిన్‌ను వచ్చినట్టే వెంటనే వినియోగిస్తున్నామన్న ఆయన, 45 ఏళ్లపైబడ్డ 3లక్షల 6వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ కేంద్రాలను పెంచి రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం 6 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఉన్నాయన్న కలెక్టర్‌ ఇంతియాజ్‌, కొత్తగా పీహెచ్‌సీ సెంటర్లను కూడా కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికై ఈ మేరకు చర్యలు చేపడతున్నట్లు వెల్లడించారు.

చదవండి: కరోనా కన్నా వారికి భయంకరమైన లక్షణాలు: కొడాలి నాని


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement