కోస్ట్‌గార్డ్‌ రైజింగ్‌ డే బైక్‌ ర్యాలీ ప్రారంభం | Coast Guard Rising Day Bike Rally begins | Sakshi
Sakshi News home page

కోస్ట్‌గార్డ్‌ రైజింగ్‌ డే బైక్‌ ర్యాలీ ప్రారంభం

Jan 29 2025 6:11 AM | Updated on Jan 29 2025 6:11 AM

Coast Guard Rising Day Bike Rally begins

విశాఖ–చెన్నై వరకు ర్యాలీ 

సింథియా: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ 49వ రైజింగ్‌ డే వేడుకల్లో భాగంగా మంగళవారం భారీ బైక్‌ ర్యాలీని కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది చేపట్టారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమై చెన్నై వరకు సాగనున్న ఈ ర్యాలీకి అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ డానీ మైఖేల్, పీటీఎం, టీఎం(జీ) కోస్ట్‌గార్డ్‌ కమాండర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

49 మంది కోస్ట్‌గార్డ్‌ సిబ్బందితో ఈ బైక్‌ ర్యాలీ విశాఖలో ప్రారంభమై సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫిబ్రవరి 1న చెన్నైలోని ట్యూటికోరిన్‌ మెరైన్‌ బీచ్‌ వద్ద ముగుస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. 

ఏపీలో సుమారు 850 కిలోమీటర్ల ప్రయాణంలో కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్ట్‌లను సందర్శించి రైజింగ్‌ డేపై అవగాహనతో పాటు రహదారి, సముద్ర భద్రత, రక్షణ విషయాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ మోటారు బైక్‌ ర్యాలీని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement