ఆక్వా స్టార్టప్‌ కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్‌ అభినందన | CM YS Jaganmohanreddy congratulated the representatives of Aqua Startup Company | Sakshi
Sakshi News home page

ఆక్వా స్టార్టప్‌ కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్‌ అభినందన

Aug 25 2023 5:02 AM | Updated on Aug 25 2023 5:17 AM

CM YS Jaganmohanreddy congratulated the representatives of Aqua Startup Company - Sakshi

సాక్షి, అమరావతి: ఆక్వారంగంలో అంతర్జాతీయ అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన స్టార్టప్‌ కంపెనీ ఆక్వాఎక్సేఛంజ్ ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీ స్టేట్‌ ఆక్వా క­ల్చ­­ర్‌ డె­వ­లప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురామ్‌తో కలిసి ఆక్వా ఎక్సేఛంజ్‌ కో–పౌండర్‌ బండి కిరణ్‌కుమార్, సీఈవో పవన్‌కృష్ణ కలిసి ఇటీవల బెంగళూరులో జరిగిన జీ–20 డిజిటల్‌ ఇన్నోవేషన్‌ అలయెన్స్‌ సమ్మిట్‌–2023లో సాధించిన గ్లోబల్‌ అవార్డును చూపించారు.

అవార్డు సాధించిన ఆక్వా ఎక్సేఛంజ్‌ ప్రతినిధులను అభినందించిన సీఎం.. చిన్న, సన్నకారు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించేలా ఆలోచనలు చేయాలని సూచించారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement