వైద్యం, ఆరోగ్యం.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

CM YS Jagan Reviews on Medical and Health Sep 2022 Updates - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైద్యం, ఆరోగ్య విభాగాల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాన్సర్‌ నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి మెడికల్‌ కాలేజీలో ప్రత్యేక విభాగాల ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న క్యాన్సర్‌ విభాగాలను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. 

విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో 4 లైనాక్‌ మెషీన్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన చోట్ల కూడా దశలవారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు లైనాక్‌ బంకర్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చారు. 7 మెడికల్‌ కాలేజీల్లో క్యాన్సర్‌ విభాగాల ఆధునీకరణ, బలోపేతానికి ఆదేశాలు ఇచ్చిన సీఎం.. కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీల్లోనూ అత్యాధునిక క్యాన్సర్‌ విభాగాల ఏర్పాటు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. ఏడాదిలోగా రక్తహీనత సమస్యను నివారించాలని సీఎం అన్నారు.

ఈ సమీక్షలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి( కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్,  వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీంద్రప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top