మిచౌంగ్‌ తుపాను: సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review Meeting On Michaung Cyclone Affected Areas | Sakshi
Sakshi News home page

సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి: సీఎం జగన్‌

Dec 5 2023 12:47 PM | Updated on Dec 5 2023 2:03 PM

CM YS Jagan Review Meeting On Cyclone Affected Areas - Sakshi

సాక్షి, తాడేపల్లి : తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్‌ ఆరా తీశారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. 

దీనిలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘ బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్‌ కూడా ప్రారంభం కావాలి. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధలను వాడుకుని రేషన్‌ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలి’ అని అధికారులకు సీఎం జగన్‌ సూచించార

నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్‌ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని తెలిపిన  అధికారులు.. చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని సీఎంకు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని,  ఆ జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదే సమయంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మందిని తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement