కోవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌, ఆక్సిజన్‌ సరఫరాపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Review Meeting On Corona Virus Black Fungus And Oxygen - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌, బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలపైన సోమవారం సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా.. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.అర్బన్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు కేసులు 2632.. రూరల్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు కేసులు 1859 ఉన్నాయని అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, మే 16న పాజిటివిట్‌ రేటు 25.56 శాతం ఉండగా, మే 30 నాటికి 15.91 శాతంగా నమోదైందని వెల్లడించారు.

అలాగే 2 లక్షలకుపైగా ఉన్న యాక్టివ్‌ కేసులు 1.6 లక్షలకు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీ రేటుకూడా గణనీయంగా మెరుగుపడిందని, మే 7న 84.32శాతంగా ఉన్న రికవరీ రేటు, ప్రస్తుతం దాదాపు 90శాతానికి చేరిందని వెల్లడించారు. మే 3న 19,175 కాల్స్‌ 104కు రాగా, మే 29న 3,803 కాల్స్‌ నమోదయ్యాయని, కేసుల సంఖ్య తగ్గిందనడానికి ఇదొక సంకేతమని అన్నారు. అన్ని జిల్లాల్లో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు.

బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యంపై సీఎం సమీక్ష
ప్రస్తుతం రాష్ట్రంలో 1179 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయని, ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 14 మంది మరణించారని, కోవిడ్‌ లేకున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిన వారిలో 1139 మంది కోవిడ్‌ సోకినవారు కాగా, 40 మందికి కోవిడ్‌రాకపోయినా బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిందన్నారు.

డయాబెటిస్‌ ఉన్నవారికి అధికంగా వస్తోందని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయని, మాత్రలను అవసరమైనంత మేర సిద్ధంచేసుకుంటున్నామని, అలాగే ప్రత్యామ్నాయ ఇంజక్షన్లుకోసం కూడా కృషిచేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలపైనా ముఖ్యమంత్రి సమీక్ష
ఆక్సిజన్‌ వినియోగం 490 టన్నులకు తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 29న 654 టన్నులను సేకరించామని, స్థానికంగా 230 టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించారు. వినియోగం ఆస్థాయికి వచ్చేంతవరకూ కూడా అధికారులు ఆక్సిజన్‌ సేకరణ, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వచేసే ట్యాంకులు ఉండాలని సీఎం ఆదేశించారు.

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను ఇప్పటివరకూ గుర్తించామని, వీరిలో 43 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్‌ చేశామని అధికారులు వెల్లడించారు. సరైన పథకాల్లో ఈ డబ్బు మదుపు చేయడం ద్వారా భద్రత, నెలనెలా వారి మెయింటినెన్స్‌ కోసం మంచి వడ్డీ వచ్చేలా చూడాలని.. చదువులకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని.. అలాగే ఉద్యోగాలకోసం వీసాలపై విదేశాలకు వెళ్లేవారికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలని.. వారికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్‌ ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

31-05-2021
May 31, 2021, 15:37 IST
సాక్షి,బళ్లారి(కర్ణాటక): కరోనా కష్టకాలం ఓ కుటుంబానికి కడుపుకోత తీర్చింది. 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన కుమారుడు లాక్​డౌన్​ కారణంగా తిరిగి అమ్మ...
31-05-2021
May 31, 2021, 14:56 IST
పట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను పాటిస్తున్నాయి.  దీని​ వలన...
31-05-2021
May 31, 2021, 13:55 IST
ఆస్రేలియా(కాన్బెర్రా): నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ సోమవారం తన కుటుంబాన్ని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను...
31-05-2021
May 31, 2021, 03:49 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం...
31-05-2021
May 31, 2021, 03:38 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యల వల్ల సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కేంద్ర...
31-05-2021
May 31, 2021, 02:59 IST
సాక్షి, హైదరాబాద్‌:     కోవిడ్‌ టీకా తీసుకోవా లనుకునేవారు తమ పేరును ఇక పోస్టాఫీసు నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు....
31-05-2021
May 31, 2021, 00:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మృతుల సంఖ్య పెరగడంతో ఉద్యోగుల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగించేందుకు, ఆర్జిస్తున్న ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆసరాగా...
30-05-2021
May 30, 2021, 21:45 IST
డెహ్రడూన్‌: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పుటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్...
30-05-2021
May 30, 2021, 18:33 IST
లండన్‌: కరోనా వైరస్‌ సహజంగా వచ్చింది కాదని... దాన్ని చైనా శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో రూపొందించారని యూరప్‌ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ...
30-05-2021
May 30, 2021, 16:56 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 79,564 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,82,247...
30-05-2021
May 30, 2021, 16:01 IST
జెనివా: ధూమపానం(పొగ త్రాగేవారు) చేసేవారిలో వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనాతో మరణించే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు...
30-05-2021
May 30, 2021, 14:59 IST
చండీఘడ్‌: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను విధించాయి. అయితే,...
30-05-2021
May 30, 2021, 14:25 IST
లక్నో: కరోనా ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. రక్త సంబంధీకులు దగ్గరకి రావడానికి జంకుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్‌...
30-05-2021
May 30, 2021, 13:13 IST
హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఎంతటి దగ్గర వారైనా, బంధువులైనా ముఖం చాటేస్తున్న రోజులివి. సహాయం...
30-05-2021
May 30, 2021, 13:01 IST
డెహ్రాడూన్‌: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మహా కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై...
30-05-2021
May 30, 2021, 12:07 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 46 రోజులతో పోల్చితే ఈ రోజు కోవిడ్‌ కేసులు తక్కువగా నమోదయ్యాయి....
30-05-2021
May 30, 2021, 11:29 IST
అల్వాల్‌: అయినవారు ఆపదలో ఉన్నారని తెలిసినా కుంటి సాకులు చూపుతూ తప్పించుకుంటున్న ఈ విపత్కర సమయంలో ప్రార్థించే పెదవులకన్నా.. సహాయం...
30-05-2021
May 30, 2021, 09:27 IST
చెన్నై/గువాహటి: అనాథ బాలలకు, కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే...
30-05-2021
May 30, 2021, 09:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో భయాందోళనలకు కారణమైన కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం మందగించింది. దేశవ్యాప్తంగా...
30-05-2021
May 30, 2021, 04:49 IST
గుంటూరు మెడికల్‌: కోవిడ్‌–19 సోకి రోజుల తరబడి ఆస్పత్రుల్లో చికిత్స పొందకుండా కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్‌ ద్వారా ఒక్కరోజులోనే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top