రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌ | CM YS Jagan Ramzan Wishes To AP Muslims And People | Sakshi
Sakshi News home page

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

Apr 11 2024 7:13 AM | Updated on Apr 11 2024 7:30 AM

CM YS Jagan Ramzan Wishes To AP Muslims And People - Sakshi

సాక్షి, తాడేపల్లి: రంజాన్‌ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్‌ ముబారక్‌’ చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్‌  తెలిపారు. 

రంజాన్‌ పండుగ సందర్భంగా సీఎం జగన్‌..‘దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలి. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement