దివ్యాంగులకు రిజర్వేషన్లు పెంచి మానవత్వం చూపిన సీఎం జగన్‌

CM Jagan showed Humanity by increasing Reservations for Disabled - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో దివ్యాంగులకు రిజర్వేషన్లను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచి మానవత్వం చూపారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

దివ్యాంగులకు రిజర్వేషన్లు పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలో వందలాదిమంది దివ్యాంగులతో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు చెబుతామని తెలిపారు. సీఎం నిర్ణయం పట్ల రాష్ట్రంలోని సుమారు పదిలక్షల మంది దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.  

చదవండి: (22న సీఎం వైఎస్‌ జగన్‌ కుప్పం పర్యటన)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top