తిరుమల: నాడు వైఎస్సార్‌.. నేడు సీఎం జగన్: భూమన

CM Jagan Historic Decision Distribute TTD House Titles Bhumana Says - Sakshi

తిరుపతి: టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ చారిత్రక నిర్ణయం అని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.ఇవాళ్టి ఇళ్ల పట్టాల పంపిణీతో టీటీడీ ఉద్యోగుల 60 ఏళ్ల కల సాకారమైందని భూమన అన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారని గుర్తు చేసిన భూమన.. సీఎం జగన్ ఇప్పుడు దాన్ని పూర్తి చేశారని అన్నారు.  శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పూర్తి చేయడం సీఎం జగన్‌ వల్లే సాధ్యమయిందని చెప్పారు. 

పేదల పట్ల గౌరవం ఉన్న ముఖ్యమంత్రి ఒక్క జగనే అని భూమన కొనియాడారు. దాదాపు మూడు వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయి.. మిగిలిన వారికి కూడా త్వరలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు భూమన వెల్లడించారు. సీఎం జగన్ హయాంలో ఇంత అభివృద్ధిలో భాగం అయినందుకు భూమన సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఇన్ని వందల ఎకరాల భూమిని టీటీడీ ఉద్యోగుల ఇళ్ల కోసం కేటాయిస్తూ సీఎం జగన్ మహత్తర కార్యక్రమం చేపడుతున్నారని భూమన అన్నారు. వైయస్‌ఆర్ హయాంలో తాను టీటీడీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించినట్లు భూమన పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల ఇంత అభిమానం ఉన్న సీఎం జగన్‌ను ఉద్యోగస్థులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. 

ఇదీ చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తిరుమలకు సీఎం జగన్‌.. అప్‌డేట్స్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top