CM Jagan At Foundation Laying Ceremony For Oberoi Seven Star Hotel At Gandikota - Sakshi
Sakshi News home page

Oberoi 7 Star Hotel: ఇక గ్లోబల్‌ గండికోట

Published Mon, Jul 10 2023 4:03 AM

CM Jagan At Foundation laying ceremony for Oberoi Seven Star Hotel - Sakshi

ప్రస్తుతం దేశంలో పర్యాటకం కీ రోల్‌ పోషిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక దార్శనికతతో తన డైనమిక్‌ లీడర్షిప్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఇందులో మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రపంచ స్థాయి సెవెన్‌ స్టార్‌ రిసార్ట్స్‌ను, మంచి రూమ్స్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తాం. ఏపీలో హోటల్స్‌ స్థాపించడం వల్ల ఇక్కడి వారికి ఉపాధి ఇవ్వగలుగుతాం. ప్రఖ్యాతిగాంచిన ఈ గండికోటలో మంచి సౌకర్యాలతో లగ్జరీ సెవెన్‌ స్టార్‌ రిసార్ట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, వైజాగ్‌లో కూడా హోటల్స్‌ను ప్రారంభిస్తాం. 2025కు ఈ హోటల్స్‌ ప్రారంభమవుతాయి.  
    –  విక్రమ్‌సింగ్‌ ఒబెరాయ్, ఒబెరాయ్‌ హోటల్స్‌ సీఈవో   

సాక్షి ప్రతినిధి, కడప: గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా పిల్చుకునే మన గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజక­వర్గంలోని గండికోటలో ఆదివారం ఆయన ఒబె­రాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా­రు. తిరుపతి, విశాఖ­పట్నం ఒబెరాయ్‌ హోటల్స్‌కు కూడా వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దేవుడి దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు.

ఒక్కరోజే గండి­కోట, విశాఖ­పట్నం, తిరుపతితో కలిపి మూడు చోట్ల ఒబెరాయ్‌ హోటళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్ర­మాలు జరగడం సంతోషకరం అని చెప్పారు. ఒబె­రాయ్‌ లాంటి గ్రూపు ఇక్కడకు వచ్చి.. సూపర్‌ లగ్జరీ సెవెన్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం చేపడుతోందన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద గ్రూపులు వచ్చి ఇలాంటి హో­టల్స్‌ కడితే గండికోట గ్లోబల్‌ టూరిజం మ్యాప్‌లోకి చేరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్‌ జిల్లా, గండికోట రెండూ అంతర్జాతీయంగా చోటు దక్కించుకుంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
 ఏపీ కార్ల్‌ లో నూటెక్‌ బయోసైన్సెస్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ఉద్యోగావకాశాలు విస్తృతం
ఇక్కడ ఒబెరాయ్‌ హోటల్‌ రావడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ఈ హోటల్‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 500 నుంచి 800 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒబెరాయ్‌ ప్రాజెక్టు అనేది మిగిలిన ప్రాజెక్టులు రావడానికి ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది. గండికోటలో ఇలాంటి గ్రూపు ప్రాజెక్టులు రావడానికి ఇంకా అవకాశం ఉంది. ఒబరాయ్‌ లాంటి ఇంకో గ్రూపుని తీసుకొచ్చే కార్యక్రమం ముమ్మరంగా చేస్తాం. 

► ఇంతకుముందు విక్రమ్‌ ఒబెరాయ్‌తో మాట్లాడుతూ ఇక్కడ గోల్ఫ్‌ కోర్ట్‌ పెట్టే ఆలోచన చేస్తే హోటల్‌కు మంచిదని, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని.. ఈ హోటల్‌ను ఒక గోల్ఫ్‌ రిసార్ట్‌గా దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పాను. ఆ దిశగా అడుగులు వేసేలా ఆలోచన చేస్తామన్నారు. 

► విక్రమ్‌ ఒబెరాయ్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రాజెక్టు రావడానికి శాయశక్తులా కృషి చేసిన చీఫ్‌ సెక్రటరీ కెఎస్‌ జవహర్‌రెడ్డి నుంచి పర్యాటక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌ సహా ప్రతి ప్రభుత్వ అధికారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టుకు మీ అందరి సహకారం చాలా అవసరం. ఈ కంపెనీ మన గురించి బయట గొప్పగా మాట్లాడితే ఇంకా నాలుగు కంపెనీలు ఇక్కడకు వచ్చే పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 

► ఏవైనా చిన్న చిన్న అంశాలుంటే కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. మనం ఎంత సహకారం అందిస్తే మన జిల్లా ప్రతిష్ట అంతగా పెరిగి అంత ఎక్కువ పరిశ్రమలు వస్తాయి.. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడి పెడతారు. మీ సోదరునిగా అందరికీ ఇదే నా విజ్ఞప్తి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 

ఇక వేగంగా స్టీల్‌ ప్లాంట్‌ పనులు
► జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్‌ ఫ్యాక్టరీ రావాలని కలులు కన్నాం. మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలని దశాబ్దాలుగా కన్న కలను నిజం చేస్తూ గతేడాది జిందాల్‌ గ్రూపుతో కలిసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఇందుకు సంబంధించిన వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌కు ఈ నెలలోనే ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌ వస్తుంది. ఆ తర్వాత రెట్టించిన వేగంతో పనులు జరుగుతాయి. 

► రేపు కొప్పర్తిలో డిక్సన్‌ కంపెనీకి సంబంధించిన ప్లాంట్‌కు ప్రారంభోత్సవం చేస్తున్నాం. కొప్పర్తిలో డిక్సన్‌ గ్రూపు 1000కి పైగా ఉద్యోగాలు ఇచ్చింది. మరో రెండు నెలల్లో ఇంకో 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఛానల్‌ ప్లే అనే మరో కంపెనీ హోం ఆడియో సిస్టమ్స్‌ తయారు చేస్తుంది. రేపు కొప్పర్తిలో ఆ కంపెనీతో  ఎంఓయూపై సంతకాలు చేయనున్నాం. ఈ కంపెనీ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

► ఎల్‌ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్‌ ప్రొడక్టస్‌ తయారు చేసే టెక్నో డామ్‌ ఇండియా అనే మరో కంపెనీతో కూడా రేపు ఎంఓయూ చేయబోతున్నాం. ఈ కంపెనీ ద్వారా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వైఎస్సార్‌ జిల్లాకు ఇంకా మంచి చేయాల్సిన అవసరం, మంచి జరిగే రోజులు చాలా ఉన్నాయి. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా చేసే పరిస్థితులు, అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

Advertisement
 
Advertisement