ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు

Published Sat, Jan 6 2024 5:20 PM

CM Jagan Congratulates ISRO Scientists For Aditya L1 Success - Sakshi

సాక్షి, తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైంటిస్టులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 అద్భుత విజయంపై సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ శనివారం అద్భుత విజయం సాధించింది. ఆదిత్య వ్యోమనౌక సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలో లాంగ్రేజియన్‌ పాయింట్‌లోకి ప్రవేశించింది. ఈ వ్యోమనౌక అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్‌-1 పాయింట్‌లోకి ప్రవేశించింది.

చదవండి: Aditya-L1 Mission: ఆదిత్య ఎల్‌-1 సంపూర్ణ విజయం.. ఎల్‌ 1 పాయింట్‌లోకి ప్రవేశించిన వ్యోమనౌక

Advertisement
 
Advertisement