వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్పకు అస్వస్థత | Chittoor MP Reddappa Admitted To Hospital With Heart Problem | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్పకు అస్వస్థత

Jul 29 2021 8:07 PM | Updated on Jul 30 2021 3:03 PM

Chittoor MP Reddappa Admitted To Hospital With Heart Problem - Sakshi

పుంగనూరు: పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం గుండెపో టు రావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఫోర్టీస్‌ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి పేస్‌మేకర్‌ను అమర్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. రెండుమూడు రోజుల్లో ఆపరేషన్‌ చేయనున్నట్టు ఆయన కుమార్తె డాక్టర్‌ హిమబిందు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కుమార్తెతో పాటు, భార్య రెడ్డెమ్మ, అల్లుడు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.   


 

Advertisement
 
Advertisement
Advertisement