
కలెక్టర్ ఛాంబర్ బయట అతికించిన నోటీసు
చిత్తూరు కలెక్టరేట్: కలెక్టర్ మురుగన్ హరినారాయణన్ విలక్షణ విధానాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవడంపై అధికార వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలు, బహుమతులు తీసుకురాకూడదని కలెక్టర్ ఛాంబర్ వెలుపల నోటీస్ పెట్టించారు. అలాగే చాంబర్‌లో నిర్వహించే సమీక్ష సమావేశాలకు స్నాక్స్ బిల్లులు పెట్టకూడదని సిబ్బందిని ఆదేశించారు. తన కార్యాలయ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చును తానే భరిస్తానని స్పష్టం చేశారు. సమావేశాల్లో ఉన్నప్పుడు మినహా అర్జీదారులను నేరుగా తన చాంబర్‌కే పంపించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కొత్త కలెక్టర్ వినూత్నశైలిపై జిల్లా యంత్రాంగంలో విస్తృతంగా చర్చ మొదలైంది.
(చదవండి: ఊర్మిళ జీవితంలో ‘గుడ్ మార్నింగ్’)
సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ