తెలుగు ప్రజల ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది: ఎన్వీరమణ | Chief Justice NV Ramana Comments On AP Tour | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజల ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది: ఎన్వీరమణ

Dec 27 2021 9:15 PM | Updated on Dec 27 2021 9:21 PM

Chief Justice NV Ramana Comments On AP Tour - Sakshi

చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ (ఫైల్‌)

సాక్షి, కృష్ణాజిల్లా: తెలుగు ప్రజల ఆశీర్వాదమే తనను ఈ స్థాయికి చేర్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి​ జస్టిస్‌ ఎన్వీరమణ అన్నారు. పొన్నవరం పర్యటనపై సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పర్యటనకు సహకరించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబ సభ్యులకు సొంత గ్రామం చూపించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

ఆతిథ్యమిచ్చిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి సీఎం జగన్‌కి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌, ఏపీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌, హైకోర్టు ఉద్యోగులు, రోటరీ క్లబ్‌ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement