ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై 18 వరకు నిర్ణయం వాయిదా - ఏసీబీ కోర్టు

Chandrababu Quash Petition Postponed - Sakshi

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ 18కి వాయిదా పడింది. ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై ఎప్పుడు కోర్టు ముందు హాజరుపరచాలో 18 తర్వాత నిర్ణయిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కావున సోమవారం కోర్టుకి హాజరుపరచాల్సిన అవసరం లేదు.

విచారణ సందర్బంగా చంద్రబాబుని 18 వరకు కస్టడీకి తీసుకోకూడదని సీఐడీని ఆదేశించింది. అంతే కాకుండా ఆ లోపల కోర్టు ముందు హాజరుపరచవద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఆధారంగా 18 తర్వాతే చంద్రబాబు పిటి వారెంట్‌పై నిర్ణయం తీసుకోనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top