ఖజానాపై బాబు ప్రత్యేక విమానాల భారం | Chandrababu Naidu special flights burden the treasury | Sakshi
Sakshi News home page

ఖజానాపై బాబు ప్రత్యేక విమానాల భారం

Jun 10 2026 4:38 AM | Updated on Jun 10 2026 6:22 AM

Chandrababu Naidu special flights burden the treasury

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తిరుగు­తున్న విలాసవంతమైన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. ఇటీవల పొ­దుపు మాటలు చెప్పిన చంద్రబాబు.. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రత్యేక హె­లికాప్టర్లు, విమానాల్లోనే ప్రయాణిస్తు­న్నా­రు. జిల్లాల పర్యటనలకు, పక్క రాష్ట్రంలోని తన నివాసానికి, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలకు, చివరకు ఉండవల్లి నుంచి గన్నవరానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్, విమానాలనే వినియో­గిస్తున్నారు. 

2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దె చెల్లింపుల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.54.63 కోట్లు కేటాయించింది. ఇందులో నుంచి తొలి త్రైమాసికానికి రూ.19.12 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) ముఖ్య కార్యదర్శి జె.శ్యామ­లరావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు.  గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో చంద్రబాబు ప్రత్యేక విమానా­లు, హెలికాప్టర్లకు రాష్ట్ర ప్రభు­త్వం రూ.­­109.04 కోట్లు ఖర్చు చేసింది. 2024–25లో రూ.54.41 కోట్లు.. 2025–­26లో రూ.54.63 కోట్ల వ్యయం చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement