గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఆలయాల నిర్మాణ పనులు నిలిపి వేయాలని 2024 సెపె్టంబర్ 10న ఇచి్చన మెమో
తిరుమల శ్రీవారి ట్రస్టు నిధుల దోపిడీకి బాబు సర్కారు కుతంత్రం
భక్తుల కమిటీల ముసుగులో భారీ అవినీతికి స్కెచ్
రూ.300 కోట్లతో 1,950 గుళ్ల నిర్మాణ పనులు టీడీపీ నేతలకే
గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించిన గుళ్లను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
కొత్తగా ఐదువేల గుళ్లను నిర్మించాలని నిర్ణయం
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్టు నిధులను కొల్లగొట్టేందుకు సరికొత్త కుతంత్రానికి చంద్రబాబు సర్కారు తెరతీసింది. ట్రస్టు నిధులతో గుళ్లు నిర్మాణం పేరుతో భారీ అవినీతికి ప్రణాళిక రచించింది. రూ.300 కోట్లతో చేపట్టిన 1,950 గుళ్ల నిర్మాణాన్ని భక్తుల కమిటీల ముసుగులో టీడీపీ నేతలకే అప్పగించి దాగుడుమూతలాడుతోంది. మరో మూడు వేల గుళ్ల నిర్మాణాన్నీ ఇలాగే వెన్నుపోటు పార్టీ నేతలకు అప్పగించేందుకు కుట్రపన్నుతోంది. శ్రీవాణి ట్రస్టు నిధులను పలారంలా పంచేందుకు తెగిస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీవాణి ట్రస్టుపై గతంలో దు్రష్పచారం
గత ప్రభుత్వంలో శ్రీవారి ట్రస్టు ద్వారా ఆలయాల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారంచుట్టారు. అప్పట్లో నిధుల దురి్వనియోగం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వారి అనుయాయులు తీవ్ర దు్రష్పచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ ఆరోపణలను నిరూపించలేక చతికిలపడిన చంద్రబాబు బృందం ఇప్పుడు ఆ ట్రస్టు నిధులను తమ వారికి దోచిపెట్టేందుకు కుట్రపన్నింది. గత ప్రభుత్వంలో గుడుల నిర్మాణ పనులను
పూర్తి పారదర్శకంగా పోటీ టెండరు విధానంలో అప్పగించగా.. ప్రస్తుత చంద్రబాబు భక్తుల కమిటీల పేరుతో గ్రామాల్లోని అధికార టీడీపీ నేతలకే అప్పగించడం గమనార్హం.
గత రెండేళ్ల కాలంలో దాదాపు రూ.300 కోట్ల విలువైన 1,950 గుళ్ల నిర్మాణ పనులను ఆయా కమిటీలకు అప్పగించింది. గ్రామాల్లో ఉండే సర్పంచి పదవీ కాలం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబే దేవదాయశాఖ సమీక్ష సమావేశంలో.. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో
చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో, గ్రామాల్లో టీడీపీ కూటమి నేతలే కమిటీలుగా ఏర్పడి ఆ పనులను దక్కించుకున్నట్టు దేవదాయ శాఖలో చర్చ సాగుతోంది.
వాస్తవానికి రూ.700 కోట్లతో ఐదువేల గుడుల నిర్మాణానికి అనుమతులిచ్చారు. అయితే తొలుత 1,950 గుడుల నిర్మాణాలను టీడీపీ కూటమి నేతలకు అప్పగించిన సర్కారు మిగిలిన గుడుల నిర్మాణ బాధ్యతలను ఇలాగే అప్పగించేందుకు సిద్ధపడుతోంది.

గత ప్రభుత్వంలో మంజూరు చేసిన గుళ్లను రద్దుచేసి మరీ..
టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో మత్స్యకార, బలహీన వర్గాల కాలనీల్లో గుళ్ల నిర్మాణానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,111 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసింది. 2024 జూన్‌లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికే అందులో 622 ఆలయాల నిర్మాణాన్ని పూర్తిచేసింది.మరో 1,765 ఆలయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గత ప్రభుత్వంలో మంజూరై ప్రారంభ దశలో ఉన్న 1,724 ఆలయాల పనుల టెండర్లను రద్దు చేశారు. ఆ తర్వాత కొత్త గుళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చి దోపిడీకి శ్రీకారం చుట్టారనే విమర్శలు అన్ని వర్గాల నుంచీ వినిపిస్తున్నాయి.


