సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు | Chandrababu Naidu Government Imprisoning Employees in CI Ali Death Case | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు

Sep 29 2026 6:08 AM | Updated on Sep 29 2026 6:08 AM

Chandrababu Naidu Government Imprisoning Employees in CI Ali Death Case

సీఐ అలీ మృతి కేసులో ఉద్యోగులను ఇరికిస్తున్న చంద్రబాబు సర్కారు  

అనుమానాస్పద స్థితిలో సీఐ అలీ మృతి చెందారని కేసు.. ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారిని గుర్తించి ఇరికించే యత్నం 

సత్యనారాయణపురం, మాచవరం స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు  

ఈ ప్రశ్నలకు బదులేదీ?
⇒ 11.30 గంటలకు ఛాతీలో నొప్పిగా ఉందని సీఐ చెబితే, ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి గంట సమయం ఎందుకు పట్టింది?  
⇒ ముందు రోజు బందోబస్తులో ఉండి అర్ధరాత్రి 2.30 గంటలకు సీఐ ఇంటికి వెళ్లడం నిజం కాదా? 
⇒ మళ్లీ తెల్లవారుజామున 4 గంటలకల్లా బందోబస్తుకు రావడం వాస్తవం కాదా? 
⇒ ఉదయం నుంచి ఛాతీలో అసౌకర్యంగా ఉందని సహచరులతో అనడం నిజం కాదా? 
⇒ ఉదయం 11 గంటలప్పుడు జీప్‌ డ్రైవర్‌ను తీసుకుని ఆస్పత్రికి వెళ్లడం వాస్తవం కాదా? 
⇒ సీఐ జీపు దిగి నడుచుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తున్నది నిజం కాదా? 
⇒ లోపల ఆయన డాక్టర్‌ వద్ద ఉండగా ఉన్నతాధికారుల నుంచి ఫోన్‌ రాగానే తిరిగి ధర్నా చౌక్‌కు వచ్చేయడం వాస్తవం కాదా?  
⇒ఆయన అనారోగ్యాన్ని దాచి ఉద్యోగులపై నింద మోపడం ఎవరి కోసం?  

సాక్షి ప్రతినిధి, విజయవాడ:  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉవ్వెత్తున ఎగసి పడటం, ప్రభు­త్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతో వారిని వేధించడానికి సన్నాహాలు మొద­లయ్యాయి. ఆదివారం జరిగిన ఆందోళనలో విజ­యవాడ నున్న పోలీసు స్టేషన్‌ సీఐ అహ్మద్‌ అలీ గుండె­నొప్పితో మృతి చెందిన ఘటనను అడ్డం పెట్టుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయించారు. దీన్ని ఈ ఉద్యమంలో చురుకు­గా పాల్గొన్న సచివాలయ ఉద్యోగులపై మోపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆస్పత్రి రిపోర్టులో, పంచనామాలో.. ధర్నాలో జరిగిన తోపులాట వల్ల సీఐ మృతి చెందినట్లు గంజి సుధాకర్‌ అనే కానిస్టేబుల్‌తో ఫిర్యాదు చేయించారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నా చౌక్‌ వద్ద ధర్నా చేపడుతున్నందున ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సీఐతో కలిసి అక్కడికి బందోబçస్తుకు వచ్చామని కానిస్టేబుల్‌ సుధాకర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఉదయం 11.30 గంట­ల సమయంలో అలంకార్‌ సెంటర్‌కు వేలాదిగా ఉద్యోగులు కేకలు వేసుకుంటూ గుంపులుగా రావడంతో ధర్నాకు అనుమతి  లేనందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని తాము పలుమార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా సీఐని నెట్టుకుంటూ వెళ్లా­రు. సీఐ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు.

నేను వెళ్లి కూర్చొబెట్టి.. నీళ్లు తాగించాను. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో మధ్యాçహ్నం 12.45కి విజయవాడ సూర్యారావుపేటలోని ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి జాయిన్‌ చేశాం. వెంటనే డాక్టర్లు పరీక్షించి సీపీఆర్‌ కూడా చేశారు. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో సీఐ మరణించినట్లుగా డాక్టర్లు ప్రకటించారు’ అని కానిస్టేబుల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.    

వైద్యానికి ఎందుకంత ఆలస్యం? 
11.30 గంటలకు తోపులాట జరిగితే.. ఛాతీలో నొప్పిగా ఉందని సీఐ చెబితే, పక్కనే కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి గంట ఎందుకు పట్టిందన్న అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. వాస్తవానికి ముందు రోజు బందోబస్తులో ఉండి అర్ధరాత్రి 2.30 గంటలకు ఇంటికి వెళ్లిన సీఐ.. మళ్లీ తెల్లవారుజామున 4 గంటలకల్లా బందోబస్తుకు వచ్చినట్లు తోటి పోలీసులు చెబుతున్నారు. ఉదయం నుంచి ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఉదయం 11 గంటలప్పుడు జీప్‌ డ్రైవర్‌ను తీసుకుని పల్లెం పెద్దేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లినట్లు సీసీ ఫుటే­జ్‌లో ఉంది.

జీపు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్లిన ఆయన డాక్టర్‌ వద్ద ఉండగానే పై అధికారుల నుంచి ఫోన్‌ వచ్చిందని, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే అనారోగ్యం సాకుతో వెళ్లిపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేయడంతో డాక్టర్‌ వద్ద గ్యాస్‌ టాబ్లెట్, యాస్పిరిన్‌ టాబ్లెట్‌ తీసుకుని, టెస్టులకు మళ్లీ వస్తానంటూ సీఐ అలీ ధర్నా చౌక్‌కు వచ్చేసినట్లు సమాచారం. మళ్లీ వచ్చిన తర్వాత ఛాతీ నొప్పి ఎక్కువ అవ్వడంతో 12.45 గంటలకు ఆంధ్రా హాస్పిటల్‌కు వెళ్లడం, అక్కడ ఆయన మరణించ­డం జరిగిపోయింది. ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే అలీ చనిపోయాడని తోటి సి­బ్బంది  చెబుతున్నారు.

ఈ అనుకోని ఘటనను కూడా ప్రభుత్వం రా­జకీయానికి వా­డు­కో­వడంమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసు అధికారుల సంఘం పేరుతో వచ్చిన ప్రెస్‌నోట్‌లోనూ సచివాలయ సిబ్బంది ఆందోళనలో అ­ల్లరి మూకలు ప్రవేశించాయంటూ పేర్కొనడం సచివాలయ ఉద్యోగులపై కేసు పె­ట్టేందుకేనన్న అను­మా­నాలున్నాయి. ఉద్యమంలో పాల్గొ­న్న వారి­లో 46 మందిపై సత్యనారాయణపు­రం స్టేషన్‌లో 170 బిఎన్‌ఎస్‌ సెక్షన్‌ కింద అక్రమ కేసు నమోదు చేశారు. మాచవరం స్టేషన్‌లో 24 మందిపై సెక్షన్‌ 170 బిఎన్‌ఎస్‌ కింద అక్రమ కేసులు నమోదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement