1న కృష్ణా బోర్డు సమావేశం | Krishna Board meeting on October 1 | Sakshi
Sakshi News home page

1న కృష్ణా బోర్డు సమావేశం

Sep 29 2026 5:40 AM | Updated on Sep 29 2026 5:40 AM

Krishna Board meeting on October 1

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) 21వ సర్వసభ్య సమావేశం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో అక్టోబర్‌ 1న జరగనుంది. సమావేశంలో చర్చించే అంశాల జాబితా(అజెండా)లో 10 అంశాలను చేర్చాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ప్రతిపాదించారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సతీష్‌ కాంబోజ్‌కు లేఖ రాశారు.  

అజెండాలో చేర్చడానికి ప్రతిపాదించిన అంశాలు ఇవే.. 
2026–27లోనూ కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ కృష్ణా జలాలను పంపిణీ చేయాలి. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ సర్కార్‌ ఖాళీ చేస్తోంది. తాగునీటి అవసరాల రీత్యా తెలంగాణను విద్యుదుత్పత్తి చేయకుండా నియంత్రించాలి. అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలి.  కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు చేయాలి. 

తెలంగాణ అనుమతి లేకుండా చేపట్టిన సుంకిశాల, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి సామర్థ్యం అదనంగా 15 టీఎంసీల పెంపు, అచ్చంపేట ఎత్తిపోతల, నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల, వైరా నదిపై జవహర్‌ ఎత్తిపోతల, రేలంపాడు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు, గూడెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు, పులిచింతల ఎగువ, దిగువన రాజీవ్‌ ఎత్తిపోతల, జన్‌పహాడ్‌ ఎత్తిపోతల, బెట్టె తాండ ఎత్తిపోతల, నక్కగూడెం, ముక్త్యాల ఎత్తిపోతల, మున్నేరు–పాలార్‌ లింక్‌ ద్వారా 50 టీఎంసీల మళ్లింపును నిలుపుదల చేయాలి. సాగర్‌ ఎడమ కాలువ నష్టాలను లెక్కించాలి. సాగర్‌ కుడి, ఎడమ కాలువ వద్ద గేజ్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement