ప్రభుత్వ ఉద్యోగం నుంచి కాకర్ల వెంకట్రామిరెడ్డి తొలగింపు | Chandrababu government conspiracy against Kakarla Venkata Rami Reddy | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగం నుంచి కాకర్ల వెంకట్రామిరెడ్డి తొలగింపు

Apr 20 2026 6:17 PM | Updated on Apr 20 2026 6:45 PM

Chandrababu government conspiracy against Kakarla Venkata Rami Reddy

సాక్షి,విజయవాడ: ఏపీ ఉద్యోగ సంఘం నాయకుడిపై కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి గత 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తూ, చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కక్ష సాధింపులకు దిగింది.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిపై పగబట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనపై చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి సస్పెన్షన్ విధించారు. ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement