Dec 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

Dec 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Wed, Dec 13 2023 7:05 AM

Chandrababu Case Petitions And Political Updates 13th December - Sakshi

TDP Chandrababu Cases, Political Updates..

6:24 PM, Dec 13, 2023
చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అంటే ఇష్టం లేదు : మంత్రి అమర్నాథ్‌

 • విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి
 • విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదు
 • టీడీపీ, జనసేనలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని  విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి
 • ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని
 • నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు
 • పవన్ అజ్ఞాతవాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి
 • ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి
   

6:04 PM, Dec 13, 2023
దళితులకు అన్యాయం చేసింది చంద్రబాబే : ధర్మాన

 • శ్రీకాకుళం : చంద్రబాబు ఏ రోజైనా దళితులను పట్టించుకున్నారా? : మంత్రి ధర్మాన
 • అవినీతికి తావులేకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు
 • అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కట్టడం కాదు
 • ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం
 • రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబుకు కనిపించదు : మంత్రి ధర్మాన

5:33 PM, Dec 13, 2023
బాబు పాలసీ.. ఆక్‌ పాక్‌ కరివేపాక్‌.! : YSRCP

 • పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు
 • చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం
 • వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.!
 • వైసీపీ నుంచి 23 మంది MLA  లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు
 • వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు
 • కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.?
 • గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది
 • దళితుల స్థానాల్లో మార్పు చేసి  వారికే   వేరే చోట్ల  టికెట్లు ఇచ్చింది
 • బీసీ అయినా విడదల రజనీకి  గుంటూరు వెస్ట్ కేటాయించారు
 • కానీ ఆళ్ల  రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు  గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా?
 • ఇక SC  నియోజక వర్గాల్లో రెడ్లదే  పెత్తనం అంటూ మరో విషం
 • టీడీపీ హయాంలో SC, BC  నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా?
 • దళితుల్లో పుట్టాలని ఎవరు  కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా?
 • రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా?
 • బాబు 5  ఏళ్ల పాలనలో ఎస్సీల  కోసం చేసిన  ఖర్చు  - రూ.35,250.46 కోట్లు
 • ఎస్సీల కోసం సీఎం జగన్‌ ప్రభుత్వం 4 ఏళ్లలో  చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు
 • దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు :
 • బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5
 • బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15  కార్పొరేషన్ పదవులు ఇచ్చారు
 • శాసన మండలి చైర్మన్‌గా మోషెన్‌ రాజును చేశారు
 • రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే  మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా?

4:22 PM, Dec 13, 2023
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌.. ఇద్దరినీ ఎవరూ నమ్మరు : సజ్జల

 • మీడియాతో YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
 • చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేదు
 • పవన్ ని నమ్ముకుని మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు
 • కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లారు
 • 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు
 • జగన్ వచ్చాక ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు
 • కరోనాలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ప్రజల ఎకానమీ దెబ్బతినలేదు
 • ఎల్లోమీడియాలో వార్తలు రాయించుకుని చంద్రబాబు ఒక భ్రమలో బతుకుతన్నారు
 • పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ జగన్ అక్కున చేర్చుకున్నారు
 • చిన్న చిన్న అసంతృప్తులు అన్నీ సర్దుకుంటాయి
 • టీడీపీ అనే శిధిలపార్టీని చంద్రబాబు ఏలుకుంటున్నారు
 • ఎల్లోమీడియానే టీడీపీని, చంద్రబాబును నడిపిస్తోంది
 • వారు పగటికలలు కంటున్నారు
 • అదే కలలు కంటూ అలాగే వారు భ్రమల్లో ఉండాలని కోరుకుంటున్నాం
 • వై నాట్ 175 అనే లక్ష్యంతోనే మేము పని చేస్తున్నాం
 • జగన్ ఏం తప్పు చేస్తారా? ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు
 • అసలు టీడీపీకి అభ్యర్థులు ఉన్నారో లేదో కూడా తెలియని దుస్థితి

3:45 PM, Dec 13, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు రేపటికి వాయిదా

 • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం కేసు
 • ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
 • బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
 • తదుపరి విచారణ రేపటికి వాయిదా

3:03 PM, Dec 13, 2023
మాకొద్దీ జనసేన, పవన్‌ కళ్యాణ్‌.. మీకో దండం

 • జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి

 • పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా
 • నా కూతురు  కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్  వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది
 • పవన్‌ కళ్యాణ్‌ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది
 • కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు  
 • పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి  వెళ్ళగొట్టారు
 • పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను
 • పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది
 • పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది..
 • ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు
 • పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు
 • టిడిపిపై గతంలో అవినీతి  చేశారని విమర్శలు చేశాడు
 • ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు
 • పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను
 • పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను
 • పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు
 • జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి  కోవర్ట్  అని పవన్ అంటున్నాడు
 • జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్
 • ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం
 • టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు
 • కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు
 • టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు
 • టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే

జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి 

 • పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను
 • పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను
 • ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను
 • పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు
 • నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు
 • పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు
 • నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు

2:44 PM, Dec 13, 2023
ఐఆర్‌ఆర్‌ పిటిషన్‌ రేపటికి వాయిదా

 • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు
 • ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ 
 • ఇవాళ కూడా జరిగిన విచారణ
 • తదుపరి విచారణ రేపటికి వాయిదా

1:14 PM, Dec 13, 2023
ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా?

 • భారీ సంఖ్యలో టీడీపీ బోగస్‌ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు
 • కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల  బోగస్‌ ఓట్లు
 • కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు..
 • విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్)
 • 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు
 • వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ
 • 2014-19 మధ్య సేవామిత్ర యాప్‌తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్‌ చేసిన టిడిపి
 • ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు
 • వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్
 • హైదరాబాద్‌లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు
 • గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం
 • తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు
 • మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు

12:44 PM, Dec 13, 2023
నేడు హైకోర్టులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు

 • IRR కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా
 • ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు
 • రింగ్ రోడ్డు కేసులో సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.?

 • CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
 • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
 • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
 • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
 • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
 • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
 • 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
 • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
 • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
 • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
 • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
 • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
 • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
 • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు

12:25 PM, Dec 13, 2023
స్కిల్‌ స్కాం కేసు CBI అప్పగించాల్సిందే

 • ఏపీ హైకోర్టులో స్కిల్ కేసు వ్యవహారం
 • స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్
 • విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
 • కొందరు ప్రతివాదులకు నోటీసులు అందలేదని, మరికొందరు నోటీసులు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారన్న పిటిషనర్
 • పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం
 • ఉండవల్లి పిటిషన్ విచారణ 2 వారాలు వాయిదా

12:05 PM, Dec 13, 2023
బాబు కేరాఫ్‌ తమిళనాడు

 • తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో చంద్రబాబు పర్యటన
 • శ్రీరామానుజార్‌ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
 • సమానత్వం కోసం శ్రీ రామానుజులు పాటు పడ్డారు : చంద్రబాబు

11:55 AM, Dec 13, 2023
పార్టీ ఆఫీసుకు దారేది.?

 • మూడు నెలల విరామం తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్న చంద్రబాబు
 • మ.2 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు
 • మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు సమక్షంలో కుప్పం కార్యకర్తలతో భేటీ
 • సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం
 • లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభపై చంద్రబాబు మంతనాలు
 • ఇప్పటికే యువగళం గురించి పార్టీ సీనియర్ల ఫిర్యాదు
 • కీలకమైన ఉత్తరాంధ్రను విస్మరించామంటోన్న సీనియర్లు
 • 200 కిలోమీటర్ల (భోగాపురం-ఇచ్ఛాపురం) విస్మరించడంపై తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందంటున్న సీనియర్లు
 • లోకేష్‌ను ఒప్పించలేం.. ఇక్కడితో ముగించాలన్న యోచనలో చంద్రబాబు

11:15 AM, Dec 13, 2023
చంద్రబాబు మిత్రుడికి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

 • ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్
 • జారీచేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్
 • ఆంధ్రజ్యోతి దినపత్రికలో తనపై అవమానకరమైన వార్తలు ప్రచురించినందుకు కేసు
 • కోర్టులో కేసు వేసిన నమస్తే దినపత్రిక ఎడిటర్ ముత్యాల సైదేశ్వరరావు
 • కోర్టుకు హాజరు కాకపోవటంతో ఎండి రాధాకృష్ణ ,మరో నలుగురికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్

10:45 AM, Dec 13, 2023
రాష్ట్రానికి చంద్రబాబు చేసింది సున్నా : ధర్మాన

 • చోడవరంలో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు మంత్రి
 • టిడిపి హయాంలో వ్యవసాయం మైనస్ గ్రోత్ లోకి వెళ్ళింది
 • వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయం గ్రోత్ పెరిగింది..
 • టిడిపి హయాంలో GDP 16 వ స్థానంలో ఉంది
 • వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 4 స్థానంలో ఉంది..
 • రైతులకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు..
 • చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్ళీ రైతాంగం నాశనం అయిపోతారు.
 • ఇచ్చిన మాటకు చంద్రబాబు ఎప్పుడూ కట్టుబడి ఉండరు..
 • 2 లక్షల 40 వేల కోట్ల రూపాయల పేదల ఖాతాల్లో సీఎం జగన్ వేశారు..
 • రూపాయి అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నారు..
 • డబ్బు ఇవ్వటమే కాదు పేదవాని గౌరవాన్ని పెంచారు..
 • నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు..
 • ప్రైవేట్ స్కూల్స్ కంటే అద్భుతంగా ప్రభుత్వం స్కూల్స్ ను తయారు చేశారు..
 • ఓట్లు కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తేలేదు..
 • పిల్లల భవిష్యత్ కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తెచ్చారు..
 • రానున్న రోజుల్లో విద్య వ్యవస్థ లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది..
 • పసుపు కుంకుమ పేరుతో మహిళను చంద్రబాబు మోసం చేశారు..
 • రైతు రుణ మాఫీ చేస్తామని మోసం చేశారు..
 • అర్హత ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు..
 • చంద్రబాబు అధికారంలోకి వస్త్తే జన్మ భూమి బ్రోకర్లను తెస్తారు..

10:05 AM, Dec 13, 2023
జనసేను టిడిపికి అద్దెకిచ్చారు : నందిగం సురేష్‌

 • చోడవరం : నందిగామ సురేష్ కామెంట్స్
 • చంద్రబాబు బడుగు,బలహీన వర్గాలను అవమానించారు.
 • బీసీ,ఎస్సీ,ఎస్టీలు జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు.
 • జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది.
 • ఆకలి తీర్చే నాయకుడు కావాలో.. మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలి.
 • చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి.
 • ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?
 • రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అందువలనే టిడీపిని ప్రజలు పక్కన పెట్టారు.
 • టిడిపికి- జనసేన పార్టీని అద్దెకు ఇచ్చారు.
 • పవన్ కళ్యాణ్ అవసరం అయినపప్పుడు పార్టీని అప్పుడప్పుడు తాకట్టు పడుతున్నాడు.
 • పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో డిపాజిట్లు రాలేదు.
 • పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు.
 • జగన్ మోహన్ రెడ్డిపై సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఎందుకు లేదు?
 • ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను కాల్చి చంపినది చంద్రబాబు కాదా!

7:50 AM, Dec 13, 2023
మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు..
టీడీపీ-జనసేన వేరు వేరు కాదు.
రెండూ ఒక్కటే..
టీడీపీ తోక పార్టీ జనసేన.

టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి..
కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన..
మాయాజాల పార్టీనే జనసేన.

2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి..
నెరవేర్చకుండా మేనిఫెస్టోను..
దాచిపెడితే పవన్ కల్యాణ్‌ ఇప్పటి వరకూ..
ఎందుకు ప్రశ్నించలేదు..?

తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే..
తనది బాధ్యత అన్నాడు..
చంద్రబాబు ప్రశ్నించకపోవడమే..
పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..?

2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా..
ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!!

చెప్పేవాడు చంద్రబాబు అయితే..
వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!!

అసలు..
టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు.

పార్టీ పెట్టి పదేళ్లు దాటినా..
పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను..
గెలిపించుకోలేని పవన్‌ కల్యాణ్..
పోటీ చేసిన రెండు చోట్ల..
ఓడిపోయిన పవన్ కల్యాణ్‌కు..
మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..?

మొన్న ఐదు అంశాలపై చర్చ..
నేడు 10 అంశాలపై చర్చ అంటూ..
లీకులు ఎల్లో కుట్రలో భాగమే..
ప్రజలను మోసం చేయడంలో భాగమే.

అసలు..
చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు.
పవన్‌ రాజకీయాలకు వేస్ట్ అని..
ప్రజలు అనుకుంటున్నారు.
వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!!

మేం అధికారంలోకి వస్తే..
ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని..
స్లిప్‌లు పంచుతున్నారు.

ఏ ప్రాతిపదిన స్లిప్‌లు పంచుతున్నారు..
ఏ హామీ ప్రకారం స్లిప్‌లు ఇస్తున్నారు..
ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..?

టీడీపీ - జనసేన కూటమి..
2024లో ఘోరంగా ఓడిపోతుందని ..
ప్రజలు చెబుతున్న మాట.

ఓడేపోయేదానికి..
ఫేక్ మేనిఫెస్టో అవసరమా..?
చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌లు సమాధానం చెప్పాలి.

మేనిఫెస్టోపై ఇప్పటికే..
హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు.
ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ..
హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు.

సంక్షేమ పథకాలతో..
రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన..
బాబు బ్యాచ్ ఇప్పుడు..
మేం అధికారంలోకి వస్తే..
సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు.
దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..?

నేతి బీరకాయలో నేయి ఉండదు..
చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని..
గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట.

ఒకపక్క వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం..
టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంటే..
ఎల్లో బ్యాచ్‌ మాత్రం..
బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు.

 

6:50 AM, Dec 13, 2023
చంద్రబాబు కేసులు - స్టేటస్‌

చంద్రబాబు కేసుల స్టేటస్‌ ఏంటీ?

కేసు : స్కిల్ కుంభకోణం

 • స్టేటస్‌ : నవంబర్‌ 20న బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు
 • వివరణ :  ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చిన హైకోర్టు
 • కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు

కేసు : స్కిల్ స్కాం

 • అంశం : క్వాష్‌ పిటిషన్‌
 • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
 • వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం

కేసు : ఇసుక కుంభకోణం

 • అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
 • వివరణ : డిసెంబర్‌ 12 (నిన్న), డిసెంబర్‌ 13(నేడు) విచారణ.

చంద్రబాబు కేసులు @ హైకోర్టు

 • హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా
 • IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
 • అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు
 • తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ
 • కేసు విచారణ ఈరోజుకి వాయిదా
 • ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
 • ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా

 
కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి

 • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
 • వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా

కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు

 • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : మంజూరు చేసిన హైకోర్టు
 • వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు


కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు

 • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : హైకోర్టులో జరిగిన విచారణ
 • వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్

6:30 AM, Dec 13, 2023
తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్‌

 • ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా?
 • చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా?
 • ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు?

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో అభియోగాలేంటీ?

 • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
 • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
 • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
 • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
 • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
 • జూలై 22,2015  & ఏప్రిల్‌ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
 • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
 • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
 • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
 • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
 • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
 • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
 • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు

ఫైబర్‌ గ్రిడ్‌ కేసు @ సుప్రీంకోర్టు

 • ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా
 • చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు
 • విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
 • చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా
 • కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన
 • చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
 • CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్‌మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా
 • ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్‌గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు
 • ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

‘ఫైబర్‌గ్రిడ్‌’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు

 • టెరాసాఫ్ట్‌ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్‌ సన్నిహితులు
 • కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు
 • రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్‌ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు అప్పగింత
 • కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక
 • వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ LLP అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీ సృష్టి
 • ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
 • నెటాప్స్‌ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ
 • నెటాప్స్‌ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మళ్లించారు.
 • నెటాప్స్‌ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు
 • వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్‌ కంపెనీ బదిలీ
 • నెటాప్స్‌ కంపెనీ 2017 జూన్‌ నుంచి 2020 జూన్‌ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ
 • నెటాప్స్‌ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ
 • టెరాసాఫ్ట్‌ లావాదేవీలను ఆడిటింగ్‌ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్‌
 • ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు.

Advertisement
 
Advertisement