పోలవరం మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నదే లక్ష్యం: కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. 2024 జూన్ నాటికి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలని తెలిపింది. గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదలు కారణంగా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ టార్గెట్ చేరుకుంటున్నామని పేర్కొంది.
రాజ్యసభలో ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 79 శాతం పనులు జరిగాయని, భూసేకరణ రీహబిలిటేషన్ పనులు 22 శాతం పూర్తయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు.
చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..!