విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని ప్రైవేటీకరణ్ చేస్తారనే అనుకుంటున్న తరుణంలో మొత్తం సీఐఎస్ఎఫ్(CISF) సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలలపాటు గడువు ఇచ్చి నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో స్టీల్ ప్లాంట్ భద్రతపై అయోమయం నెలకొంది.
2024 వరకూ స్టీల్ ప్లాంట్‌లో 1500 మంది వరకు సీఐఎస్ఎఫ్ బలగాలు విధులు నిర్వహించాయి. అనంతరం దశల వారీగా సిబ్బంది ఉపసంహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో కొనసాగుతున్న 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని ఇప్పుడు వెనక్కి తీసుకోవాలని కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ చేయడంతో కొత్త సందేహాలు నెలకొంటున్నాయి.


