Botsa Satyanarayana Fires On Ramoji Rao Over Eenadu False News, Details Inside - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్: మంత్రి బొత్స

Nov 12 2022 5:58 PM | Updated on Nov 13 2022 8:01 AM

Botsa Satyanarayana Fires on Ramoji Rao Over Eenadu False News - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో ఈ తరహా వ్యక్తిత్వం ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ మేరకు మంత్రి బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..

'విశాఖలో ప్రధాని నరేంద్రమోదీ సభ విజయవంతమయింది. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. విశాఖ సభ ద్వారా సీఎం జగన్‌ ప్రజలకు మంచి మెసేజ్‌ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను హుందాగా ప్రధానికి సీఎం జగన్‌ వివరించారు. పార్టీలు కాదు అభివృద్ధే ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌. 

రాష్ట్ర కొన్ని పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యం. కొన్ని పత్రికలు వారికే వత్తాసు పలుకుతున్నాయి. ఉత్తరాంధ్రపై వారికి ఎంత అక్కసుందో ప్రజలు తెలుసుకోవాలి. ఈనాడు రామోజీరావుకు ఒళ్లు పోతరం. రాష్ట్రంపైన, సీఎం జగన్‌పైన రామోజీరావుకు అక్కసు. ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్రంతో సఖ్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. రుషికొండ నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. రుషికొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నది వాస్తవం. ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ప్రశ్నించారు.

మా ప్రభుత్వం వచ్చాక జగనన్న కాలనీల పేరుతో మేం కొత్తగా ఊర్లు కడుతున్నాం. కానీ వీళ్లు పేదల ఇళ్లపై కూడా రాజకీయం చేస్తున్నారు. కాలనీలతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పేదల ఇళ్లపై వీరికి ఉన్న అభ్యంతరం ఏంటి?. పేదలకు చంద్రబాబు ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement