ప్రధానితో పవన్ భేటీపై జీవీఎల్ ఏం చెప్పారంటే..!

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.15వేల కోట్లతో రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు.
మోదీ విశాఖ పర్యటనలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రపక్షం అయినందునే ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
చదవండి: (బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్)