అనంతపురం జిల్లా: అనంతపురం బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరుకి చెందిన గుడ్డి వండ్రప్ప ఈశ్వర్ కొడుకు వరుణ్‌కు ఒకే ఎద్దు ఉంది. దీని సామర్థ్యం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. మంగళవారం గ్రామ శివార్లలో పొలంలో పండించిన 125 పప్పుశనగ బస్తాలను (ఒక్కో బస్తా 60 కేజీలు) 6 ఎద్దులబండ్లలో నింపారు. ఎద్దులబండికి ఒకవైపు వరుణ్‌కు చెందిన ఎద్దును కట్టారు. మరోవైపు కాడిని మనుషులు లాగారు. దాదాపు 5 కి.మీ. వరకు పప్పుశనగలతో నింపిన ఎడ్ల బండ్లను మనుషులు మారుతూ వచ్చినా.. ఆ ఎద్దు మాత్రం బాహుబలిలా జంకకుండా లాగింది. ఆ ఎద్దు బండ్లను లాగడాన్ని చూసి అక్కడకు వచ్చిన వారు ఉత్సాహంగా కేరింతలు, ఈలలు వేశారు. కొందరు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.


