సాక్షి,విజయవాడ: తిరువూరు టీడీపీలో వాట్సాప్ మెసేజ్, ఆడియో కలకలం రేపుతున్నాయి. టీడీపీ వాట్సాప్ గ్రూపులో కేశినేని చిన్ని, శావల దేవదత్తు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అందులో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని దేవదత్తు వద్ద.. కేశినేని చిన్ని కోట్లు వసూలు చేశారని మెసేజ్‌లో ఉంది. ఆడియోల్లో తాను ఆర్థికంగా చితిపోయానని దేవదత్తు మాట్లాడారు.


