
93.46 శాతం విద్యార్థులు హాజరు
నేడు ప్రిలిమినరీ కీ, 9న ఫలితాల విడుదల
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్( ఏయూఈఈటీ–2025) సోమవారం ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 6,028 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5,634 మంది హాజరైనట్లు వర్సిటీ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ డీ.ఏ.నాయుడు వెల్లడించారు.
ఎంట్రన్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 8 సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని పేర్కొన్నారు. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. విశాఖ నగరంలోని గాయత్రి విద్యాపరిషత్ డిగ్రీ కాలేజీ, బుల్లయ్య కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ తనిఖీ చేసి, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.