పంచాయతీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఎస్‌ఈసీ ఆదేశాలు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైనా అన్ని వార్డుల సభ్యుల స్థానాలు ఏకగ్రీవమై కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన చోట్ల ఆయా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, విలీనానికి అనుమతిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ ఆదివారం ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు.


