అంతర్‌ జిల్లాల బదిలీలకు రేపటి నుంచి దరఖాస్తులు | Applications for inter district transfers from tomorrow | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లాల బదిలీలకు రేపటి నుంచి దరఖాస్తులు

Nov 20 2025 4:40 AM | Updated on Nov 20 2025 4:40 AM

Applications for inter district transfers from tomorrow

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు స్పౌజ్‌ కేటగిరీలో అంతర్‌ జిల్లాల బదిలీలకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ శివప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సర్కులర్‌ జారీ చేశారు. 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందన్నారు. 

జిల్లాల వారీగా అందిన దరఖాస్తులపై 25, 26 తేదీల్లో పరిశీలన అనంతరం సీనియారిటీ ప్రకారం జాబితాలు ప్రకటించి, 26 సాయంత్రానికల్లా కలెక్టర్లు ఆ శాఖాధిపతులకు పంపాలని సూచించారు. 29వ తేదీ కల్లా బదిలీల ఆర్డర్‌ జారీతో పాటు సచివాలయాల కేటాయింపు పూర్తి చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement