ఆగిపోయిన చోట ఎన్నికల నిర్వహణపై కసరత్తు | AP SEC Re Election For where Sarpanch MPTC and ZPTC Elections Stop | Sakshi
Sakshi News home page

ఆగిపోయిన చోట ఎన్నికల నిర్వహణపై కసరత్తు

Sep 24 2021 8:47 AM | Updated on Sep 24 2021 8:48 AM

AP SEC Re Election For where Sarpanch MPTC and ZPTC Elections Stop - Sakshi

సాక్షి, అమరావతి : వివిధ కారణాలతో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయిన చోట తిరిగి నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని గురువారం పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో నీలంసాహ్నితో భేటీ అయ్యారు. ఎన్నికలు ఆగిపోయిన స్థానాల వివరాలు అందజేశారు. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement