AP Inter Results 2024: రేపే ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటలకంటే? | AP Inter Results 2024: Results Will Be Declared Tomorrow, April 12, At 11 Am - Sakshi
Sakshi News home page

AP Inter Results 2024: రేపే ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటలకంటే?

Published Thu, Apr 11 2024 3:07 PM

AP Inter Results 2024: Ap Inter Results Released On April 12th - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్‌ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్‌ బోర్డు ప్రకటించనుంది. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది.

మార్చి ఒకటి నుంచి  20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి ఇంటర్‌ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నాపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించింది.

 ఏపీ ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల 2024 ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement