breaking news
AP Inter Results 2024
-
ఏపీ ఇంటర్ 2024 ఫలితాలు విడుదల
-
AP Inter Results 2024: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటలకంటే?
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నాపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించింది. ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు.