ఉన్నత విద్యాభివృద్ధికి ఒప్పందం

AP Higher Education Council MOU With South Korea - Sakshi

దక్షిణ కొరియాకు చెందిన క్రెసిహెచ్‌ఆర్డీతో ఉన్నత విద్యామండలి ఎంవోయూ

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగంలో వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దీన్లో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ సోషల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ డెవలప్‌మెంట్‌ (క్రెసిహెచ్‌ఆర్డీ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం  క్రెసిహెచ్‌ఆర్డీ చైర్మన్‌ డాంగ్‌ యోప్‌ కిమ్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ సుధీర్‌ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్యకరమైన మానవ వనరులను సమాజానికి అందించడానికి అవకాశం కలుగుతుంది. విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో కొరియన్‌ లాంగ్వేజ్, విదేశీ విశ్వవిద్యాలయ మార్పిడి కార్యక్రమాలు, పరిశ్రమ ఇంటర్న్‌షిప్‌లు కూడా ఎంవోయూలో భాగంగా ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top