కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు? | AP High Court Question Sharmila Sunitha B tech Ravi On Viveka Case | Sakshi
Sakshi News home page

కోర్టు పెండింగ్‌లోని కేసు గురించి ఎలా మాట్లాడతారు? షర్మిల ,బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించిన హైకోర్టు

May 3 2024 5:23 PM | Updated on May 3 2024 5:51 PM

AP High Court Question Sharmila Sunitha B tech Ravi On Viveka Case

సాక్షి, విజయవాడ: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడుతారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించింది. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని పేర్కొంది. 

కేసు విచారణలో ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా చెబుతారని ప్రశ్నించింది. హంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హతకుడ్ని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెబుతారన్న హైకోర్టు అలా చెప్పటం తప్పు అని తెలిపింది.ఇలా చెప్పటం నేరపురితమైన చర్యలు కిందకు వస్తుంని పేర్కొంది. 

అయిదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు వివేకా హత్యపై మాట్లాడకూడదు అంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లను కొట్టివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement