ఏపీలో పింఛన్ల పండుగ.. తెల్లవారుజాము నుంచే పంపిణీ | AP Govt Released Rs 17 Hundread Crores For Pension Distribution | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీకిరూ.1,754.64 కోట్లు విడుదల

Mar 1 2023 9:21 AM | Updated on Mar 1 2023 1:09 PM

AP Govt Released Rs 17 Hundread Crores For Pension Distribution - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు  వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతుంది. ఇందుకోసం రూ.1,754.64 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పింఛన్‌ డబ్బును ప్రభుత్వం.. ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 63,66,280 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ చేతి వృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు.  తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తున్నారు.

(చదవండి: ఆన్‌లైన్‌లో నోటరీల సమాచారం)

Advertisement
 
Advertisement
Advertisement