ఏపీలో కొత్తగా 8,976  కరోనా కేసులు.. | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 8,976  కరోనా కేసులు..

Jun 6 2021 4:58 PM | Updated on Jun 13 2021 7:34 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 83,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 8,976 పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా 90 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారి నుంచి 13,568 మంది  కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా.. 16 లక్షల 23 వేల 447 మంది కరోనా నుంచి కోలుకుని  డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం 1,23,426 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,97,91,721 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ కరోనాపై ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. 

చదవండి: ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు 

Advertisement
 
Advertisement
Advertisement