
AP Elections Political Latest Updates Telugu..
09:00PM, జనవరి 12, 2024
చంద్రబాబూ.. గెట్ రెడీ
- చంద్రబాబు చిల్లర రాజకీయంతో విసిగిపోయిన రాయపాటి రంగారావు
- తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసిందంటూ ఆవేదన
- చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టిన రంగారావు
- నారా లోకేష్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తా అంటూ రాయపాటి రంగారావు సవాల్
ఇదీ మీ తెలుగుదేశం పార్టీ లో నీ బతుకు @ncbn..
— YSR Congress Party (@YSRCParty) January 12, 2024
ఇప్పుడు నీ సొంత క్యాడరే నీ ఫోటో ని నేలకేసి కొట్టారు… వచ్చే ఎన్నికల్లో నిన్ను, నీ కొడుకు @naralokesh ని ప్రజలు ఈడ్చి కొట్టే రోజు వస్తుంది.
Get Ready for the day @JaiTDP!#EndOfTDP pic.twitter.com/5uLPCzY8uo
08:55PM, జనవరి 12, 2024
టీడీపీ-జనసేన.. టికెట్ల విషయంలో సిత్రాలు
- పొత్తు ప్రకటన క్షణం నుంచే బయటపడుతున్న లుకలుకలు
- పరస్పర అభ్యంతరాలతో ముందుకు సాగుతున్న ఇరు పార్టీల కేడర్‌లు
- దెందలూరులో చింతమనేనికి జనసేనతో పాటు టీడీపీ శ్రేణుల షాక్
- చింతమనేనికి సీటు డౌటేనంటూ చర్చా
- తాజాగా.. పవన్ కల్యాణ్‌ను కలిసిన వేదవ్యాస్, మాగుంట
- పెడన టిడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వేదవ్యాస్
- కైకలూరు లేదంటే ఏలూరు నుంచి టికెట్ ఆశిస్తున్న మాగంటి బాబు
- ఈ మూడు స్థానాలను జనసేనకు కేటాయించారనే ప్రచారం
- ముందు జాగ్రత్తలోనే టీడీపీ నేతల లాబీయింగ్
08:12PM, జనవరి 12, 2024
రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పర్యటన: వైవీ సుబ్బారెడ్డి
- త్వరలో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటన
- ఐదు ప్రాంతాల్లో కార్యకర్తలతో సమావేశం
- తొలుత ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన
- భీమిలిలో 25వ తేదీన తొలి సమావేశం
07:23PM, జనవరి 12, 2024
నమ్మకస్తులకే వైఎస్సార్‌సీపీలో ప్రాధాన్యత: విజయసాయిరెడ్డి
- పదవుల కోసం పార్టీలో ఉండేవాళ్లు నిజమైన కార్యకర్తలుకారు
- అధినేతపై నమ్మకం ఉన్నవారే ఎక్కువకాలం పార్టీలో ఉండగలరు
- నమ్మకస్తులకే వైఎస్సార్‌సీపీ ప్రాధాన్యత ఇస్తుంది
- వైఎస్సార్‌సీపీలాంటి ప్రాంతీయ పార్టీలో అధ్యక్షులదే తుది నిర్ణయం
- బాలినేనికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంది
- బాలినేని ఒంగోలు నుంచే పోటీ చేస్తారు
06:57PM, జనవరి 12, 2024
25 నుంచి వైఎస్సార్‌సీపీ కేడర్ సమావేశాలు
- సంక్రాంతి తర్వాత ఎన్నికల క్షేత్రంలోకి వైఎస్సార్‌సీపీ
- పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేడర్ సమావేశం
- ఐదు లేదా ఆరు జిల్లాలతో ఒక రీజన్‌గా ఏర్పాటు
- మొత్తం ఐదు రీజన్లవారీగా.. ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు
- తొలి సమావేశం జనవరి 25వ తేదీన విశాఖ భీమిలిలో
- ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్
“Message to YSRCP Cadre”
— YSR Congress Party (@YSRCParty) January 12, 2024
పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని "5 రీజియన్ లలో క్యాడర్ మీటింగ్"లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు.
4-6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి,…
06:44PM, జనవరి 12, 2024
పెనమలూరు టీడీపీలో అయోమయం
- బోడే ప్రసాద్ సీటుకి ఎసరుపెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు
- టిక్కెట్ రాదేమోననే ఆందోళనలో బోడే ప్రసాద్
- సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథికి వైఎస్సార్‌సీపీ నుంచి దక్కని అవకాశం
- టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న పార్ధసారథి
- పెనమలూరు టిక్కెట్ ఆశిస్తున్న పార్ధసారథి
- పార్టీలో జరుగుతున్న పరిణీమాల పై అసంతృప్తితో ఉన్న బోడే ప్రసాద్
- బోడే ప్రసాద్ ను బుజ్జగించే పనిలో టీడీపీ
- గద్దె రామ్మోహన్ ను బోడే ప్రసాద్ ఇంటికి పంపించిన టీడీపీ అధిష్టానం
06:30PM, జనవరి 12, 2024
టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ: రాయపాటి రంగారావు
- తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయ పార్టీయే కాదు
- తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ
- మా కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది తెలుగుదేశం పార్టీ
- గత ఎన్నికల్లో రూ. 150 కోట్లు మా నుంచి తీసుకున్నారు
- లోకేష్, చంద్రబాబు మాదగ్గర ఎంత తీసుకున్నారో లెక్కలంతా ఉంది
- మంగళగిరి లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా!
- సవాల్ చేసి చెప్తున్న లోకేష్ ను మంగళగిరిలో ఓడిస్తా
- కియా కంపెనీ నేనే తెచ్చారని చెప్పుకునే చంద్రబాబు మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయాడు
- గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గ ల్లో ఎమ్మెల్యేలను చంద్రబాబు లోకేష్ ఎక్కడ పనిచెయ్యనివ్వలేదు
- కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తాడు మేము అన్ని కులాలకు పని చేస్తాం
05:07PM, జనవరి 12, 2024
బాలయ్య.. ఇక చాలయ్యా
- నందమూరి బాలకృష్ణపై హిందూపురం వాసుల ఆగ్రహం
- టీడీపీ ఎమ్మెల్యేగా కన్నా.. సినిమాలకే అధిక ప్రాధాన్యం
- చుట్టుపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్న వైనం
- నియోజకవర్గం గురించి పట్టించుకోవడం లేదని హిందూపురం వాసుల ఆగ్రహం
- వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటున్న హిందూపురం వాసులు
05:01PM, జనవరి 12, 2024
చంద్రబాబుకు బ్యాడ్ టైం
- టీడీపీని వరుసగా వీడుతున్న సీనియర్లు
- కేశినేని నాని బాటలోనే మరికొందరు
- తాజాగా రాయపాటి తనయుడు రంగారావు రాజీనామా
- షాక్ నుంచి కోలుకోకముందే.. మరో రాజీనామా
- టీడీపీకి లింగమనేని శివరామ ప్రసాద్ రాజీనామా
- టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగమనేని శివరామ ప్రసాద్
- ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించిన లింగమనేని
- ఈయన ద్వారానే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు వేయించిన చంద్రబాబు
04:22PM, జనవరి 12, 2024
టీడీపీకి మరో షాక్
- తెలుగుదేశం పార్టీకి రాయపాటి రంగారావు రాజీనామా
- రాయపాటి సాంబశివ రావు తనయుడు రాయపాటి రంగారావు
- కొన్నాళ్లుగా పార్టీపై తీవ్ర అసంతృప్తి గా ఉన్న రాయపాటి కుటుంబం
04:20PM, జనవరి 12, 2024
నాలుగో జాబితా పనుల్లో వైఎస్సార్‌సీపీ
- సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు
- కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
- అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్
- ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి
- పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జి ఆమంచి కృష్ణమోహన్ రాక
- క్షేత్రస్థాయి పరిస్థితులు.. సామాజిక సమీకరణాల కోణంలో చర్చల తర్వాతే వైఎస్సార్‌సీపీ నాలుగో జాబితా విడుదల
03:10PM, జనవరి 12, 2024
వ్యక్తిగతంగా తిట్టమని చెప్పడం తప్పు: విజయసాయిరెడ్డి
- వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజనల్ కోర్దినేటర్ విజయ సాయి రెడ్ది కామెంట్స్
- చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది.. ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహ ఎలక్షన్ కమిషన్కి వివరించాం
- రాజకీయ పార్టీలలో విమర్శలు-ప్రతి విమర్శలు సహజం
- కానీ.. పార్టీ అదినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీ లో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించవలసిన బాధ్యత ఉంటుంది
- నేతల్ని వ్యక్తిగతంగా తిట్టమని చెప్పడం పెద్ద తప్పు
- మీడియా తో పాటు తెలుగుదేశం ఆ పదాన్ని ఎందుకు వాడుతుందో తెలియదు
- కావాలనే వాళ్లంతా దుష్ప్రచారం చేస్తున్నారు
- ఏ పార్టీ అయినా విమర్శల వరకే పరిమితం కావడం సహేతుకం
- మా పార్టీ లో బాలినేనికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే
- త్వరలోనే వైఎస్సార్‌సీపీ నాలుగో జాబితా
02:40PM, జనవరి 12, 2024
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు
- టీడీపీ అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదు
- ప్రతిపక్షం లో ఉన్నప్పుడు హామీలు ఇస్తారు.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించటం చంద్రబాబు కు అలవాటే
- రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా మహిళలను ఎందుకు మోసం చేశారో చంద్రబాబు నాయుడు చెప్పాలి?
- మాట ఇస్తే మడప తిప్పని నైజం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే
- ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ దే
- జగన్ - చంద్రబాబు పాలనకు వ్యత్యాసం గమనించాలి
- టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్
02:22PM, జనవరి 12, 2024
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు
- తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆయన వ్యక్తిగత లాయర్ శ్రీనివాసులు సంచలన ఆరోపణలు
- నా కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు: లాయర్ శ్రీనివాసులు
- సభ్యసమాజం తలదించుకునేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారు: లాయర్ శ్రీనివాసులు
- ఇక నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తా: లాయర్ శ్రీనివాసులు
01:50PM, జనవరి 12, 2024
సీఎం జగన్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా: జోగి రమేష్
- మంత్రి జోగి రమేష్ కామెంట్స్
- ఎక్కడనుంచైనా నేను పోటీకి సిద్ధం
- ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తాం
- కేశినేని నానికి సీఎం జగన్‌పై ప్రేమ ఉన్నా చంద్రబాబు తిట్టుమన్నారు కాబట్టే విమర్శలు చేశారు
- నిజమేంటో తెలుసుకుని కేశినేని నాని వైఎస్సార్‌సీపీలో చేరారు
- కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు స్థానం కేటాయించారు
- సీఎం జగన్ నాయకత్వంలో పని చేయాలని కోరుకునే నాని వైఎస్సార్‌సీపీలో చేరారు
- విజయవాడ ఎంపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలవబోతుంది
- పెనమలూరులో ప్రత్యర్థిగా పార్థసారథి అయినా.. చంద్రబాబు అయినా నా పోటీ పెనమలూరు నుంచే.
01:21PM, జనవరి 12, 2024
పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తా: ఏవీ సుబ్బారెడ్డి
- మాజీ మంత్రి అఖిలప్రియ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏవి సుబ్బారెడ్డి
- పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధం అంటున్న ఏవి సుబ్బారెడ్డి
- ముస్లింలపై వివాదాస్పద పోస్టర్లు అతికించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి
- ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఎమ్మెల్యే సీటు ఇస్తే సహకరించే ప్రసక్తే లేదు
01:19PM, జనవరి 12, 2024
ఎంపీ సంజీవ్ కుమార్ తీరు సరికాదు: ఎంపీ మార్గాని భరత్
తూర్పుగోదావరి జిల్లా:
- ఎంపీ సంజీవ్ కుమార్ తీరును తప్పుపట్టిన రాజమండ్రి ఎంపి మార్గాని భరత్
- సీఎం వైఎస్ జగన్‌పై అనవసర ఆరోపణలు చేయడం సంజీవ్ కుమార్‌కు తగదు
- బీసీలు అత్యధికంగా అవకాశాలు, పదవులు కల్పించింది సీఎం జగన్ మాత్రమే
- అవకాశం లభించకపోతే సీఎం జగన్‌పై ఆరోపణలు చేసేస్తారా?
- సంజీవ్ కుమార్ తన వ్యాఖ్యలను పునరాలోచించుకోవాలి
01:14PM, జనవరి 12, 2024
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు: మంత్రి రోజా
- పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది చంద్రబాబు వైఖరి
- డబ్బులకు టికెట్లను అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు
- సర్వేల తరువాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పు జరిగింది
- సంక్రాంతి లోపు టికెట్లు ప్రకటిస్తాను అన్నావు ఎందుకు చేయలేదు?
- అభ్యర్థులు లేక పొత్తులు పెట్టుకొని చంద్రబాబు వెళ్తున్నాడు.
- కుప్పంలో గెలిచే అవకాశం లేదని చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు
- పవన్ కళ్యాణ్,లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధం అవుతున్నారు
- అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చినా జగన్‌ను ఏమి చేయలేరు.
- ఏపీలో లేని నాయకులు అంతా ఏకమై వస్తున్నారు.
- పవన్ కళ్యాణ్‌ను ప్రజలు రెండు చోట్ల ఒడించినప్పుడే పవన్ పరిస్థితి అర్థం అయ్యింది
- వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- బీజేపీతో కలిసి పోటీ చేయనని చెప్పి 2014లో పొత్తు పెట్టుకున్నాడు
- చంద్ర బాబు పొద్దున్నే జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో ఉంటాడు
- సొంత జెండా ఎజెండా చంద్రబాబుకు ఉందా
- అభ్యర్థులను మారుస్తా అని సీఎం పదే పదే చెప్పారు
- సర్వేలు ఆధారంగా టికెట్లను ఇస్తాను అని ముందే చెప్పారు
12:57PM, జనవరి 12, 2024
లోకేష్‌పై మంత్రి ఆర్‌కే రోజా సెటైర్లు
విజయవాడ:
- మందలో ఒకరిగా ఉండకూడదు
- మందలో ఒకరిగా ఉంటే మందలగిరి మొద్దులా ఉంటారు
- లోకేష్ మీకు తెలుసుగా.. పప్పు
- మీరు లోకేష్‌లాగా పప్పులాగా ఉండ కూడదు
- వందలో ఒకరిగా ఉండాలి.
- అట్లా ఉంటే సీఎం జగన్‌లా ఉంటారు... విజయాలు వస్తాయి
12: 40PM, జనవరి 12, 2024
లోకేష్‌ను సీఎం చేయడమే బాబు లక్ష్యం: కేశినేని నాని
- కేశినేని నాని కామెంట్స్..
- నన్ను ఎంపీగా ఎన్నుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు
- ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి జగన్‌కు గిఫ్ట్ ఇస్తాను
- టీడీపీ నన్ను పార్టీ నుంచి గెంటేసింది.
- లోకేష్‌ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యం
- లోకేష్‌ను సీఎం చేయడం కోసం రేపు పవన్‌ను కూడా మోసగిస్తారు
- విజయవాడను స్మశానం చేసిన చంద్రబాబు
- విజయవాడపై చంద్రబాబుకు చిన్నచూపు
- 33వేల ఏకరాలతో రైతులను మోసం చేశారు
- 30యేళ్లు అయినా రాజధాని నిర్మాణం పూర్తి అవ్వదు అని నాడే చెప్పాను
- భూ మాఫియాకి తెరలేపిన టీడీపీ నేతలు
- రాజధాని విషయంలో చంద్రబాబు స్వార్థం పూరితంగా వ్యవహరించారు
- దేశంలోనే ఎక్కువగా కార్మికులు పనిచేసే ప్రాంతం ఆటోనగర్
- కార్మికుల ఆరోగ్యానికే పెద్దపీట
- ఆటోనగర్ అభివృద్ధికి కేశినేని కుటుంబం కట్టుబడి ఉంది
- రెండెకరాల నా సొంత స్థలం ఆటోనగర్‌కి ఇచ్చాను.
- మంచివాళ్ళు కొందరే ఉంటారు కానీ సమర్థత కావాలి
- సీఎం నుండి నిధులు తెచ్చే సమర్థత అవినాష్‌ది
- తూర్పు నియోజకవర్గానికి కేశినేని, దేవినేని రక్షణగా ఉంటాం
- మా కాంబినేషన్ అంటే డబుల్ రిటైనింగ్ వాల్.
12: 15PM, జనవరి 12, 2024
వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా
- బీసీ కులగణనపై ఎంపీ ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి5కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం
- బీసీ కులగణనతోనే ఆ వర్గాల అభివృద్ధి సాధ్యమని వాదన
- విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
11:50AM, జనవరి 12, 2024
మేనిఫెస్టోపై కిం.. కర్తవ్యం?
- ఉమ్మడి మేనిఫెస్టోపై ఎడతెగని చర్చలు
- ఏం చేద్దాం? ఏమని చెబుతాం? టీడీపీ-జనసేన కసరత్తులు
- రెండు పార్టీల్లో భిన్న సిద్ధాంతాలు
- హామీల కంటే ముందే రెండు పార్టీల్లో సీట్ల చిచ్చు
- బోలెడు విభేదాల మధ్య మేనిఫెస్టో చర్చలు
- జనసేన మేనిఫెస్టో కమిటీతో నాదెండ్ల మనోహర్ సమావేశం
- ప్రతి చేతికి పని - ప్రతి చేనుకి నీరు అనే నినాదం ఉండాలంటున్న జనసేన
- ఈ నినాదం అంత వర్క్‌అవుట్ కాదంటున్న టీడీపీ
- యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై మేనిఫెస్టోలో ఫోకస్ పెడదామంటున్న టీడీపీ
- 2014-19 మధ్య ఏం చేయలేదంటున్న జనసేన
- వ్యవసాయానికి అండ, పేదల సంక్షేమంపై చర్చ
- మహిళా భద్రత, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చ
- ఎలాంటి అంశాలు పెట్టాలన్న దానిపై కుదరని ఏకాభిప్రాయం
11:40 AM, జనవరి 12, 2024
ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది: ఎంపీ ఆదాల
- నేను ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టాక టీడీపీకి వణుకు పుట్టింది
- టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది
- టీడీపీ-జనసేన కలిసొచ్చినా ఏమీ చేయలేవు
- నెల్లూరు రూరల్ పై ప్రత్యేక దృష్టి సారించాం
11:34AM, జనవరి 12, 2024
సత్తెనపల్లిలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ-జనసేన వర్గ విభేదాలు
- సత్తెనపల్లి సీటు విషయంలో టీడీపీ-జనసేన మధ్య కుస్తీలు
- జీవీ ఆంజనేయులుకు ప్రకటించటంతో నిరసనలు
- జనసేన సీటును తామే ప్రకటించుకుంటామని సోషల్ మీడియాలో పోస్టులు
11:30AM, జనవరి 12, 2024
రేపు సీఐడీ, సిట్ కార్యాలయానికి చంద్రబాబు
- ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసులు
- ముందస్తు బెయిల్‌కు సంబంధించి హైకోర్టు సూచనలు
- అధికారి ముందు హాజరై బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు
- రేపు విచారణ అధికారి ముందు హాజరుకానున్న చంద్రబాబు
- పూచీకత్తు, షూరిటీలను అధికారికి సమర్పించనున్న చంద్రబాబు
11:26AM, జనవరి 12, 2024
జనసేన వైపు మాజీ మంత్రి కొణతాల చూపు
- పవన్‌తో సమావేశం కానున్న కొణతాల రామకృష్ణ
- అనకాపల్లి పార్లమెంటు స్థానం టికెట్ ఆశిస్తున్న కొణతాల రామకృష్ణ
11:20AM, జనవరి 12, 2024
బాలయ్య బంధు ప్రీతితో రమేష్‌కుమార్‌రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరం!
- రాయచోటి టికెట్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డి ఆశలు వదులుకోవాల్సిందేనా?
- ద్వారకనాథరెడ్డికి బాలకృష్ణ హామీ ఇవ్వడంతో అయోమయంలో రమేష్‌కుమార్‌రెడ్డి
- ఇటీవల టీడీపీలో చేరిన ద్వారకనాథరెడ్డి.. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి బంధువు
- ఈ క్రమంలోనే ద్వారకనాథరెడ్డికి బాలకృష్ణ హామీ
- మరోవైపు రాయచోటి టికెట్ రేసులో రమేష్‌రెడ్డితో పాటు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- ఈ నేపథ్యంలో రమేష్‌కుమార్‌రెడ్డి భవితవ్యం అగమ్యగోచరం
11: 05 AM, జనవరి 12, 2024
పార్టీ మార్పు అంటూ ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం: గురునాథ్ రెడ్డి
- ఎల్లో మీడియాపై వైఎస్సార్‌సీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సీరియస్
- మాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు
- నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవం
- రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్ వెంటే ఉంటాను
- అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ నేతలు వేధించారు
- వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే.
10:40AM, జనవరి 12, 2024
పచ్చ బ్యాచ్‌కు కౌంటర్
- సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వాళ్లు ఇది గమనించండి
- మన జగనన్న ప్రభుత్వంలో వచ్చిన మార్పులను చూడండి
- రోడ్లు, అభివృద్ధిని గమనించండి
- పచ్చ బ్యాచ్ తప్పుడు వార్తలను నమ్మకండి.
సంక్రాంతి పండుగ కు సొంత ఊర్లు కి వస్తున్నారు గా...
— YSRCP IT WING Official™ (@ysrcpitwingoff) January 12, 2024
ఒకసారి మన గ్రామాలు, జగన్ అన్న ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు కూడా గమనించండి.. #CMYSJagan #GramaSwaraajyam#VooruMarindhi https://t.co/6CVc6qMIQn
10:15AM, జనవరి 12, 2024
ఓట్ల కోసం చంద్రబాబు మళ్లీ జిమ్మిక్కులు..
- చంద్రబాబు హయాంలో చేసిందేమీ లేదు
- 14 పాలనలో చెప్పుకోదగ్గవేమీ లేవు.
- పిచ్చి మాటలతో ప్రజలను మోసం చేయడానికి మళ్లీ రెడీ అయిన చంద్రబాబు
14 ఏళ్ళ పాలనలో @ncbn చెప్పుకోవడానికి చేసింది ఏమీలేక ... పిచ్చి మాటలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. #AapuBabuNatakam#JaganeMaaNammakam pic.twitter.com/V2pK346wc3
— YSR Congress Party (@YSRCParty) January 12, 2024
9:53AM, జనవరి 12, 2024
ప్రొద్దుటూరు టీడీపీ సీనియర్ నేత వరదరాజులురెడ్డికి మొండిచేయి!
- ప్రొద్దుటూరులో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నంద్యాల వరదరాజులురెడ్డి
- 2019 తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వరదరాజులు
- వరదరాజులును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లింగారెడ్డి
- గతంలో చంద్రబాబు హామీతో వయస్సు పైబడినా మళ్లీ తెరపైకి వరదరాజులు
- కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాబు స్వరంలో మార్పు
- నియోజకవర్గ ఇంచార్జి గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైపు బాబు మొగ్గు
9:20AM, జనవరి 12, 2024
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు తిరుగుబాటు
- గోపాలపురం టీడీపీ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు వద్దంటూ నిరసన గళం
- నేడు చంద్రబాబును కలవనున్న గోదావరి జిల్లాల టీడీపీ నేతలు
- మద్దిపాటికి తప్ప ఇంకెవరికిచ్చినా అభ్యంతరం లేదంటున్న టీడీపీ ముఖ్యనేతలు
- ఈ విషయాన్ని బాబు దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లినా ఫలితం శూన్యం
- ఈసారి బాబును కలిసి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన పార్టీ నేతలు
- నేడు(శుక్రవారం) 400కు పైగా కార్లలో మంగళగిరికి రానున్న ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నేతలు
- మద్దిపాటిని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా నియమించినప్పటి నుంచి తారాస్థాయికి చేరిన వర్గపోరు
- మద్దిపాటి తనకు నచ్చినవారిని వెంటబెట్టుకుని తిరుగుతూ, గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు
- ఇప్పటికే మద్దిపాటి ఎమ్మెల్యే అభ్యర్థి అని బాబు, లోకేశ్‌లు చాలాసార్లు బహిరంగ ప్రకటనలు
- మద్దిపాటిని ఎమ్మెల్యే అభ్యర్థిగా త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉండటంతో టీడీపీ నేతల్లో అసంతృప్తి
- ఈ విషయాన్ని బాబు ముందే తేల్చుకోవడానికి సిద్ధమైన ఉభయ గోదావరి జిల్లా టీడీపీ ముఖ్య నేతలు
9:11AM, జనవరి 12, 2024
- అగ్రకులాల చేతిలో రిజర్వుడు స్థానాలు
- మడకశిర, శింగనమల రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు మొత్తం ఆర్థిక బలమున్న అగ్రకులాల చేతుల్లోకి
- పార్టీకి పనిచేసే వారికి కాకుండా డబ్బున్న వాళ్లు ఎవరికి చెబితే వారికి టికెట్లు దక్కే అవకాశం
- అందుకే శింగనమల, మడకశిరకు పేర్లను ఖరారు చేయకుండా నాన్చుతున్న చంద్రబాబు
09:00 AM, జనవరి 12, 2024
బీసీ కుల గణన పిటిషన్‌పై నేడు విచారణ
- నేడు సుప్రీంకోర్టులో బీసీ కులగణన జరపాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
- విచారణ జరపనున్న జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం
- బీసీ కులగణనతోనే ఆ వర్గాల అభివృద్ధి సాధ్యమని వాదన
- బీసీ కులగణనపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని వాదనలు వినిపించనున్న పిటిషనర్
08:25AM, జనవరి 12, 2024
ఎన్నో ఏళ్లుగా జెండా మోసేవారికి బాబు రిక్తహస్తం
- ధనవంతులకోసం టీడీపీ అధినేత చంద్రబాబు వేట
- కళ్యాణదుర్గంలో అతిపెద్ద కాంట్రాక్టర్‌ను బరిలోకి దింపే యోచన
- గుంతకల్లులో డబ్బున్న ఓ సీఐ స్థాయి పోలీస్ అధికారి
- రాప్తాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు హల్చల్
- ఎన్నో ఏళ్లుగా జెండా మోసేవారికి మొండిచేయి
08:01AM, జనవరి 12, 2024
మహిళా సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట: విజయసాయి రెడ్డి
- మహిళా సాధికారత అమలులో దేశంలోనే ఏపీ టాప్
- జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి మహిళకు వివరించాలి
- పార్టీ మహిళా విభాగ సమావేశంలో అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి
7:54AM, జనవరి 12, 2024
ఆ రెండు సెగ్మెంట్లపై జనసేన ఆశలు వదులుకోవాల్సిందేనా?
- చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌పై జనసేన ఆశలు
- ఆ రెండు చోట్లా తన అభ్యర్థులనే బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రణాళిక
- టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యను రంగంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు
- తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీలోకి దించడం ససేమిరా ఇష్టపడని చంద్రబాబు
- అందుకే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించాలని నిర్ణయం
- జనసేన అభ్యర్థిగా తన పార్టీ నాయకురాలు సుగుణమ్మను బరిలోకి దించాలనే యోచనలో బాబు
- ఈ పరిణామాలను గమనిస్తున్న జనసేన సైనికులు.. చంద్రబాబు కుట్రలపై తీవ్ర ఆగ్రహం
- టీడీపీ వారినే జనసేన అభ్యర్థులుగా దింపటం ఏమిటని ప్రశ్నలు
- చంద్రబాబు చెప్పిన దానికి పవన్ తలూపటంపైనా జనసైనికులు మండిపాటు
7:30AM, జనవరి 12, 2024
అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషణ
- గంగాధర నెల్లూరు స్థానానికి అసలు టీడీపీ నుంచి అభ్యర్థులు కరువు.
- సరైన నాయకుడు దొరక్కపోవటంతో సీటు కోసం చాలా మంది పోటీపడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం
- పుంగనూరులో మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం ఖాయం అని తెలిసినా పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు
- టీడీపీ నుంచి అక్కడ చల్లా రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదనే నిర్ణయానికి వచ్చిన బాబు
- సోషల్ మీడియా ప్రతినిధులకు ప్యాకేజీ ఇచ్చి ప్రచారం చేసుకుంటూ హడావుడి
- రామచంద్రయాదవ్‌ని జనసేన నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపాలనే యోచన
7:15AM, జనవరి 12, 2024
వద్దు బాబూ.. మీకో దండం!
- సొంత జిల్లాలో చంద్రబాబు ఎదురీత
- కుప్పంలో ఓటమి ఖాయమని సర్వేలో తేటతెల్లం
- తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థులు ఎక్కడ?
- మిగిలిన అసెంబ్లీ స్థానాలకు వేధిస్తున్న క్యాండిడేట్ల కొరత
07:00 AM, జనవరి 12, 2024
ఇదీ చంద్రబాబు, పవన్ తీరు
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఇబ్బందులు కనపడవు
ప్రశ్నిస్తా అన్న పవన్ ప్రశ్నించడు.
ప్రజల కోసమే పని చేసే సీఎం జగన్ సమస్యకు పరిష్కారం చూపించారు.
ఆనందంలో కృష్ణలంక ప్రజలు
అధికారంలో ఉన్నప్పడు @ncbn కి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనిపించవు.
— YSR Congress Party (@YSRCParty) January 11, 2024
విజయవాడ కృష్ణలంక ప్రజల వరద ముంపు సమస్యకు రిటైనింగ్ వాల్ కట్టి శాశ్వత పరిష్కారం చూపారు సీఎం @ysjagan గారు. #YSJaganDevelopsAP#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/9iN5PMEp8R
06:45 AM, జనవరి 12, 2024
పొత్తుల తక్కెడలో కొట్టుమిట్టాడుతోన్న టీడీపీ-జనసేన
- ఏ సీటులో ఏ పార్టీ పోటీ చేస్తుంది?
- టీడీపీ ఎన్ని? జనసేనకు ఎన్ని?
- సంక్రాంతికి తొలి జాబితా ప్రకటించాలని రెండు పార్టీల్లో డిమాండ్‌లు
- 20 నుంచి 25 స్ధానాల్లో అభ్యర్ధులను టీడీపీ ప్రకటించే ఛాన్స్
- ఖాయంగా పోటీ చేసే నేతల పేర్లపై అనుమానాలు
- ఉంటారా? చివరి క్షణంలో జంపవుతారా అని టిడిపిలో ఆందోళనలు
- తొలి జాబితాలో ఎవరెవరు ఉండాలి? చంద్రబాబు చర్చలు
- ఐవీఆర్ఎస్ విధానంలో ఇప్పటికే సర్వే నిర్వహిస్తోన్న టీడీపీ
- ఓ జాతీయ సర్వే సంస్థ ద్వారా ప్రజాభిప్రాయం కోసం కసరత్తు.
06:30 AM, జనవరి 12, 2024
వైఎస్సార్‌సీపీ మూడో జాబితా.. సామాజిక న్యాయం
- వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మూడో జాబితా విడుదల
- జాబితా ప్రకటించిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
- ఆరు ఎంపీలు, 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జిల నియామకం
- సామాజిక సమీకరణాల ఆధారంగానే జాబితా రూపకల్పన
- సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకుని జాబితా
- చిత్తూరు, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో వెనుకబడిన వర్గాలకే ప్రాధాన్యం
- బీసీలకు, ఎస్సీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితా
- పలువురికి ఎంపీ స్థానాలకు ఇన్‌ఛార్జిలుగా ప్రమోషన్
- ఇప్పటిదాకా మూడు జాబితాల్లో కలిపి.. 9 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జిల మార్పు
- మొత్తం 50 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఇన్‌ఛార్జిల మార్పు.
06:30 AM, జనవరి 12, 2024
చింతమనేనికి బిగ్ షాక్
- దెందులూరు నియోజకవర్గం లో టీడీపీ జనసేన పార్టీలలో ముసలం
- చింతమనేనికి వ్యతిరేకంగా ఏలూరులో సమావేశమైన టీడీపీ జనసేన నేతలు
- ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు- ఎవరైనా ముద్దు అంటూ ఏలూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన నాయకులు
- 2024 ఎన్నికల్లో చింతమనేని తప్ప టీడీపీ జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఇంకెవరినైనా ప్రకటించాలంటూ తీర్మానం చేసిన సభ్యులు
- టీడీపీలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గమే చింతమనేని వ్యతిరేకిస్తోందంటున్న నాయకులు
- చింతమనేని ప్రభాకర్ గతంలో చేసిన దారుణాలకు ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొత్త అభ్యర్థి వస్తేనే తాము మద్దతు ఇస్తామంటూ తెలిపిన జనసేన నాయకులు
06:30 AM, జనవరి 12, 2024
హనుమాన్ జంక్షన్ లో తన్నుకున్న జనసైనికులు
- ఓ ప్రైవేట్ స్థలం సరిహద్దు పై గత కొన్ని నెలలుగా జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం
- స్థల వివాదం సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో సవాళ్లు విసురుకున్న ఇరువర్గాలు
- తన్నుకునేందుకు టైం చెప్పి మరీ ఘర్షణకు సిద్ధమైన వైనం
- ఒక వర్గానికి నాయకత్వం వహించిన గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి చలమలశెట్టి రమేష్
- చలమలశెట్టి రమేష్ వర్గం ఓవైపు.. మరో వర్గం ఇంకోవైపు రోడ్డెక్కిన జనసైనికులు
- ఇరువర్గాల మధ్య తోపులాట
- ఎందుకు ఘర్షణ జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి
- విషయం తెలుసుకుని ఇరువర్గాలకు సర్ధిచెప్పిన పోలీసులు