ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల

AP EAPCET 2021: Result Released 14th September For Agriculte And Pharmacy - Sakshi

ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రేపటి నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి సురేష్‌ తెలిపారు.

మొదటి ర్యాంకు- చందం విష్ణు వివేక్‌(తూర్పుగోదావరి- కోరుకొండ)
రెండో ర్యాంకు- శ్రీనివాస కార్తికేయ(అనంతపురం)
మూడో ర్యాంకు- బొల్లినేని విశ్వాస్‌రావు(హన్మకొండ)
 

(ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

చదవండి:
Andhra Pradesh: ‘స్కిల్‌’ఫుల్‌ కోర్సులు
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top