ఏపీ ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ నేడే

 AP EAMCET 2020 Primary Key On 26th September - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్‌ 2020 శుక్రవారంతో ప్రశాంతంగా ముగిసింది. ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి సమాధానాల ప్రాథమిక ‘కీ’ని శనివారం విడుదల చేయనున్నారు. ఈనెల 28 వరకు అభ్యంతరాలను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 

► ఉన్నత విద్యా ప్రవేశాలు ముగించి అక్టోబర్‌ నుంచి తరగతులు ప్రారంభించాలని యూజీసీ, ఏఐసీటీఈ క్యాలెండర్‌ను నిర్దేశించిన నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏపీ ఎంసెట్‌ను ఉన్నత విద్యామండలి పూర్తి చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top