తిరుపతిలో విద్యార్థుల మిస్సింగ్‌ కలకలం! | AP Crime News: Missing students stir in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో విద్యార్థుల మిస్సింగ్‌ కలకలం.. స్టడీ అవర్స్‌ కోసం వెళ్లి..

Nov 9 2022 1:44 PM | Updated on Nov 9 2022 1:50 PM

AP Crime News: Missing students stir in Tirupati - Sakshi

పదో తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు.. ఇద్దరు అబ్బాయిలు కనిపించకుండా పోవడంతో.. 

సాక్షి, తిరుపతి: జిల్లాలో బుధవారం విద్యార్థుల మిస్సింగ్‌ కలకలం రేగింది. నెహ్రూ నగర్‌లో ఉన్న శ్రీ అన్నమయ్య స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధినులు, ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బుధవారం ఉదయం స్టడీ అవర్స్ పేరుతో ఇంటి నుంచి వెళ్లిన వాళ్లు.. తిరిగి రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు సీసీ కెమెరాల్లో వాళ్ల దృశ్యాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు వాళ్ల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement