అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి | AP CM YS Jagan Pays Tribute To Potti Sriramulu | Sakshi
Sakshi News home page

అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

Mar 16 2022 12:41 PM | Updated on Mar 16 2022 3:06 PM

AP CM YS Jagan Pays Tribute To Potti Sriramulu - Sakshi

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్‌, పలువురు నేతలు పాల్గొన్నారు.

చదవండి: నా తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలి: సీఎం జగన్‌

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అమ‌ర‌జీవి పొట్టి శ్రీ రాములు జ‌యంతి వేడుక‌లు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కులం, ప్రాంతం, మతం అనే భేదాలు లేకుండా గౌరవించే వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని  లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజల మేలు కోసం చివరివరకు పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.

డీజీపీ కార్యాలయంలో..
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement