రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు | AP CM YS Jagan Mohan Reddy And Governor Wishes Krishna Janmashtami | Sakshi
Sakshi News home page

ప్రజలకు గవర్నర్, సీఎం జగన్‌‌ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

Aug 10 2020 7:34 PM | Updated on Aug 10 2020 10:14 PM

AP CM YS Jagan Mohan Reddy And Governor Wishes Krishna Janmashtami  - Sakshi

సాక్షి, అమరావతి : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జన్మాష్టమి పండుగ భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని గవర్నర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక పునాది. సమాజంలో శాంతి, స్నేహం, సోదరభావం, ప్రజా శ్రేయస్సు నెలకొల్పేందుకు ఈ శుభ దినం ప్రతీకగా నిలుస్తుంది’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. అలాగే కృష్ణాష్టమిని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారని, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు  సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement