AP CM YS Jagan Delhi Tour Updates - Sakshi
Sakshi News home page

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ

Mar 29 2023 7:06 AM | Updated on Mar 30 2023 2:33 AM

AP CM YS Jagan Delhi Tour Updates - Sakshi

రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు.

► కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పోలవరం నిధులు విడుదలతో పాటు విభజన హామీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, రెడ్డప్ప, తలారి రంగయ్య, గురుమూర్తి, అదాల ప్రభాకర్ రెడ్డి, మాధవి, అనురాధ, సత్యవతి, అయోధ్య రామిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, బీద మస్తాన్ రావు, కోటగిరి శ్రీధర్ ఘన స్వాగతం పలికారు.

రాత్రి 9:30కు  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement