ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌ | AP CM YS Jagan Congratulates ISRO Scientists | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

Jun 30 2022 9:12 PM | Updated on Jun 30 2022 9:17 PM

AP CM YS Jagan Congratulates ISRO Scientists - Sakshi

 పీఎస్‌ఎల్‌వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, అమరావతి: పీఎస్‌ఎల్‌వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
చదవండి: పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్‌ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.

Advertisement
 
Advertisement
Advertisement