AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ కీలక నిర్ణయాలు

AP Cabinet Key Decisions In Today Meeting Held By CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం భేటీ అయిన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా... జులై 8న వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవం జరపాలని నిర్ణయించింది. అదే విధంగా... 100 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. 640 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 

అలాగే.. 45 కొత్త రైతు బజార్ల ఏర్పాటు, ఆర్‌బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఊటుకూరులో నాటుకోళ్ల హేచరీస్‌ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా... ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమాచార శాఖ మంత్రి పేర్ని కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

కేబినెట్‌ నిర్ణయాలు

  • రూ.89 కోట్లతో మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు ఆమోదం
  • వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి కేబినెట్‌ ఆమోదం
  • జులై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపన మహోత్సవం
  • ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 80వేల ఆర్థికసాయం
  • మౌలిక వసతుల కల్పనకు రూ.34వేల కోట్లు ఖర్చు
  • ఇళ్లస్థలం పొందిన లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి..
  • నగదు వద్దనుకుంటే అమ్మఒడి ద్వారా ల్యాప్‌టాప్‌ పంపిణీకి ఆమోదం(ఇప్పటికే 35శాతం తల్లులు ల్యాప్‌టాప్‌లు కావాలని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో.. మూడేళ్ల వారంటీతో ల్యాప్‌టాప్‌లు పంపిణీ)
  • రూ.339 కోట్లతో ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం
  • విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను వర్శిటీగా మార్పు
  • మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు నిర్ణయం
  • నగరాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న స్థలాలు సేకరించి..
  • లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి ప్రజలకు కేటాయించాలని నిర్ణయం
  • వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని నిర్ణయం
  • కాకినాడ సెజ్‌లో 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయం
  • పీహెచ్‌సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం
  • 2021-24 ఐటీ పాలసీకి కేబినెట్‌ ఆమోదం
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top