జమిలి ఎన్నికల ఆలోచన బీజేపీకి లేదు | Sakshi
Sakshi News home page

జమిలి ఎన్నికల ఆలోచన బీజేపీకి లేదు

Published Sat, Sep 5 2020 5:55 PM

AP BJP Spokesperson Sai Krishna Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: జమిలి ఎన్నికల ఆలోచన బీజేపీకి లేదని ఆ పార్టీ ఏపీ అధికార ప్రతినిధి సాయికృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై చంద్రబాబు చేస్తోన్న ప్రచారాన్ని ఆయన తప్పబట్టారు. చంద్రబాబు ఆలోచన ఏమిటో అర్థం కావడంలేదన్నారు. దేశాన్ని ఐదేళ్లు పరిపాలించమని నరేంద్ర మోదీ సారథ్యంలో నడుస్తున్న బీజేపీని ప్రజలు గెలిపించారు. అదే విధంగా ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు గెలిపించారని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రాలేని చంద్రబాబు.. ఏకంగా ఏపీ గద్దె పై కూర్చోవాలని కలలు కంటున్నారని, పేలపిండి సామెతలా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు. (చదవండి: ‘చంద్రబాబు ఏమైనా దేవదూతనా..’)

‘‘దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం, సరిహద్దుల్లో ఉన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య  పాకిస్తాన్, చైనాకు దీటుగా బదులిచ్చే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. జమిలి వంటి ఆలోచన ప్రధాని మోదీకి లేదు. రాజకీయ నిరాశ్రయుడిగా చంద్రబాబు మారారు. రాజకీయ నిరాశ్రయులకు ఎక్కడో ఒకచోట అశ్రయం కావాలి. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో అశ్రయం పొందుతున్నారు. తిరిగి ఏపీలో అశ్రయం కోరుకుంటూ కలలు కంటున్నారని’’  ఆయన ఎద్దేవా చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడుకుంటుంటే  కిటికీలోంచి చంద్రబాబు విన్నట్టుగా మాట్లాడుతున్నారని, అవి అసంబద్ధ రాజకీయ ప్రేలాపనలని.. వాటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: సీఎం జగన్‌ సంకల్పం.. ఏపీ నెంబర్‌వన్‌)

Advertisement
Advertisement